నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. టాప్ 10 సినిమాలు ఇవే.. ఒకే ఒక తెలుగు మూవీ.. ఓ లుక్కేయండి
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ అదరగొడుతోంది. టాప్-10లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఓటీటీ వేదికలో టాప్ 10 సినిమాలు ఇవే. ఇందులో ఒకే తెలుగు మూవీ ఉంది. ఓ లుక్కేయండి.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఎకో అదరగొడుతోంది. టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాప్ 10 లో ఉన్న సినిమాలు ఏవో చూసేయండి.

దే దే ప్యార్ దే 2
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దే దే ప్యార్ దే 2 ఇప్పుడు థియేటర్ల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈసారి ఆర్ మాధవన్ ఈ సినిమాలో తన నటనతో అద్భుతాలు చేశాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం నంబర్ 1 లో ట్రెండ్ అవుతోంది.
హక్
షా బానో కేసు ఆధారంగా తెరకెక్కిన 'హక్' చిత్రం ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఈ చిత్రం ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ నంబర్ టూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
అఖండ 2
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న ఏకైక తెలుగు మూవీ అఖండ 2. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ ఈ ఓటీటీలో మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ఆర్ఐపీ
అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ఆర్ఐపి సినిమాకు కూడా ప్రేక్షకుల అభిమానం పెరుగుతోంది. ఈ చిత్రంలో మాట్ డామన్, బెన్, స్టీవ్ యూన్, టెయానా టేలర్ నటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 4వ స్థానంలో ఉంది.
ఎకో
మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఎకో ట్రెండింగ్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కథ ప్రత్యేకమైనది. ఇది కేరళ, మలేషియా నుండి వచ్చిన కుక్కల జాతి ఆధారంగా తెరకెక్కింది. కథలోని సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
మర్దానీ
రాణి ముఖర్జీ నటించిన మర్దానీ నెట్ ఫ్లిక్స్ లో ఆరో స్థానంలో, మర్దానీ 2 నెట్ ఫ్లిక్స్ లో ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇటీవలే మర్దానీ 3 ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ రెండు సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. జనవరి 31న మర్దానీ 3 సినిమాతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించబోతోంది.
పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్
పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ అనే ఇంగ్లీష్ చిత్రం నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు నచ్చిన సరదా చిత్రం. ఈ సినిమా నేడు 8వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
సింగిల్ సల్మా
హుమా ఖురేషి నటించిన సింగిల్ సల్మా ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఈ సినిమాలో సల్మా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడికి గురవుతుంది. కానీ ఆమె లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆమెకు వివాహం అర్థం మారుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 9వ స్థానంలో ఉంది.
రివాల్వర్ రీటా
రివాల్వర్ రీటా కథ సరదాగా ఉంటుంది. కీర్తి సురేష్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో 10వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


