ధురంధర్ 2పై సీరియల్ హీరోయిన్ రివ్యూ- వీడియో కాల్‌లో సీన్స్ చూశానని చెప్పిన రూపాలి గంగూలీ- ఎలా ఉన్నాయంటే?
'ధురంధర్' చిత్రానికి సీక్వెల్ వచ్చేయనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ ది రివేంజ్ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా సీరియల్ హీరోయిన్ రూపాలీ గంగూలీ ధురంధర్ 2పై రివ్యూ ఇవ్వడం వైరల్ అవుతోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది సెన్సేషన్ సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar). ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ధురంధర్ 2పై రివ్యూ
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) ఆడియెన్స్ ముందుకు రానుందనే విషయం తెలిసిందే. ధురంధర్ 2 టీజర్ విడుదలైనప్పటి నుంచి ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీరియల్ హీరోయిన్ రూపాలీ గంగూలీ పంచుకున్న విశేషాలు, ధురంధర్ 2పై ఇచ్చిన రివ్యూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
వీడియో కాల్‌లో సీక్వెల్ ఝలక్!
రూపాలీ గంగూలీ సోదరుడు విజయ్ గంగూలీ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. 'ధురంధర్'లోని పాపులర్ సాంగ్స్ 'షరారత్', 'ఫాస్లా'ను ఆయనే కంపోజ్ చేశారు. తాజాగా ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూపాలీ గంగూలీ మాట్లాడుతూ.. సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తాను ముందే చూశానని వెల్లడించారు.
వీడియో కాల్‌లో ఉన్నప్పుడు
"విజయ్ ఈ సినిమా ఎడిటింగ్ పనుల్లో ఉన్నప్పుడు మేము వీడియో కాల్‌లో ఉన్నాము. అప్పుడు అతను నాకు కొన్ని షాట్స్ చూపించాడు. అవి చూసి నేను షాక్ అయ్యాను. 'వావ్.. ఏమా విజువల్స్!' అని మురిసిపోయాను. మళ్లీ రివైండ్ చేసి చూపించమని అడిగి మరీ చూశాను. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. పార్ట్-1ను థియేటర్‌లో రెండుసార్లు చూశాను, ఇప్పుడు పార్ట్-2 కోసం అస్సలు ఆగలేకపోతున్నాను" అని రూపాలీ గంగూలీ తన ఆనందాన్ని పంచుకున్నారు.
రెట్టింపు యాక్షన్.. గట్టి పోటీ!
ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ఒక భారతీయ గూఢచారి (Agent Hamza) పాత్రలో అదరగొట్టారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూల్చే మిషన్‌లో భాగంగా ఆయన సాగించే పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మార్చి 19న రిలీజ్
అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతోపాటు సారా అర్జున్ ధురంధర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


