15 వేల థియేటర్లలో ధురంధర్ రిలీజ్ అయుంటే- ఒక్క థియేటర్ లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని అమీర్ ఖాన్ ఆవేదన- చైనాతో పోటీ అంటూ!

భారతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించాలంటే దేశంలో థియేటర్ల సంఖ్య భారీగా పెరగాలని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. చైనాతో పోలిస్తే మన స్క్రీన్స్ చాలా తక్కువని, అదే మన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని ఆయన విశ్లేషించారు. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 8, 2026, 10:01:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏడాదికి వందల సంఖ్యలో సినిమాలు ఇక్కడ నిర్మితమవుతాయి. కానీ, వసూళ్ల విషయానికి వస్తే మనం ఇంకా వెనుకబడే ఉన్నామన్నది చేదు నిజం. ఇదే విషయంపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా తన గళం విప్పారు. 'వెరైటీ ఇండియా' (Variety India)కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన భారతీయ సినిమా మార్కెట్ పరిధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

15 వేల థియేటర్లలో ధురంధర్ రిలీజ్ అయుంటే- ఒక్క థియేటర్ లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని అమీర్ ఖాన్ ఆవేదన- చైనాతో పోటీ అంటూ!
15 వేల థియేటర్లలో ధురంధర్ రిలీజ్ అయుంటే- ఒక్క థియేటర్ లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని అమీర్ ఖాన్ ఆవేదన- చైనాతో పోటీ అంటూ!

చైనాతో పోలిక.. మన పరిస్థితి ఇదీ!

భారతదేశంలో థియేటర్ల కొరత తీవ్రంగా ఉందని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. "ప్రస్తుతం మన దేశంలో కేవలం 9,000 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అదే చైనాలో దాదాపు ఒక లక్ష స్క్రీన్స్ ఉన్నాయి. మనం వారితో పోల్చితే పదో వంతు కూడా లేము" అని అమీర్ ఖాన్ తెలిపారు.

"అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు కేవలం ఆ ఒక్క దేశంలోనే 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) వసూళ్లను సాధిస్తోంది" అని అమీర్ ఖాన్ వివరించారు. థియేటర్ల సంఖ్య పెరిగినప్పుడే సినిమా వ్యాపారం అట్టడుగు స్థాయి (grassroots level) వరకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.

'ధురందర్' మూవీతో విశ్లేషణ

గతేడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రణ్‌వీర్ సింగ్ చిత్రం 'ధురందర్' (Dhurandhar) ను అమీర్ ఖాన్ ఉదాహరణగా తీసుకుని విశ్లేషించారు. "ధురందర్ సుమారు రూ. 1,000 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ ఈ సినిమా 5,000 స్క్రీన్లలో కాకుండా 15,000 స్క్రీన్లలో విడుదలయ్యి ఉంటే.. వసూళ్లు ఊహకందని స్థాయిలో ఉండేవి. ఇప్పటికీ మన దేశంలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి" అని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన 'నే ఝా 2' (Ne Zha 2) సుమారు 2 బిలియన్ డాలర్ల మార్కును దాటి ప్రపంచ రికార్డు సృష్టించగా, మన దేశంలో గతేడాది టాప్ గ్రాసర్ అయిన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 మిలియన్ డాలర్ల లోపే వసూలు చేసింది. స్క్రీన్ల సంఖ్యే ఈ భారీ వ్యత్యాసానికి కారణమని ఆయన విశ్లేషించారు.

మార్చిలో రానున్న 'ధురందర్: ది రివెంజ్'

ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు తన సీక్వెల్‌కు సిద్ధమైంది. 'ధురందర్: ది రివెంజ్' పేరుతో వస్తున్న ఈ పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది.

ఇక అమీర్ ఖాన్ గత ఏడాది 'సితారే జమీన్ పర్' చిత్రంతో పలకరించారు. అది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ పలు సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తూనే, పూర్తిస్థాయి కథల కోసం వెతుకుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More