హనీ రివ్యూ- పిల్లి మాయలో చీకటి మనుషుల కథ- నవీన్ చంద్ర, బిగ్ బాస్ దివి డార్క్ హారర్ థ్రిల్లర్ భయం పుట్టించిందా?
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. బిగ్ బాస్ దివి, దివ్య పిళ్లై, రాజా రవీంద్ర నటించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి హనీ మూవీ రివ్యూ తెలుసుకుందాం.
హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మరో టాలీవుడ్ సినిమానే హనీ. వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి వాద్యా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా మలిచారు డైరెక్టర్ కరుణ కుమార్.

చీకటి ప్రయాణాన్ని
‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్ వాస్తవ సంఘటనల ఆధారంగా 'హనీ' సినిమాతో ఓ చీకటి ప్రయాణాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. భయపెట్టే ఆత్మలు కాదు, భయపెట్టే మనుషులే ఈ కథకు కేంద్ర బిందువు అని, మూఢనమ్మకాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయి? అనే ప్రశ్న ఆడియెన్స్‌ను భయపెడుతుందని మేకర్స్ చెబుతూ వచ్చారు.
ప్రమోషనల్ కంటెంట్‌తో భయపెట్టిన హనీ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 6) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? వంటి అంశాలను నేటి హనీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఆనంద్ (నవీన్ చంద్ర) మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలను బాగా నమ్ముతాడు. ఆ నమ్మకాల కారణంగానే ఉద్యోగం పోతుంది. ఆనంద్ భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా… ఇద్దరూ అతని భయంకరమైన ఆలోచనల మధ్య నలిగిపోతుంటారు.
ఈ క్రమంలోనే ఆనంద్ తన కుటుంబాన్ని ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ తన పూజలు ఫలిస్తాయని, మీరా తన మాట వింటే అన్నీ బాగుపడతాయని చెబుతాడు. మొదట ఎదిరించిన లలిత కూడా ఆ తర్వాత పరిస్థితుల ముందు తలవంచుతుంది.
అనంతరం ఏం జరిగింది? అసలు ఆనంద్ మీరాతో ఏం చేయించాడు? అతని మూఢనమ్మకాలకు నిజంగానే ఫలితం దక్కిందా? ఆ ఇంట్లో తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయానక అనుభవాలు ఏంటీ? పిల్లి మాయ ఏంటీ? చీకటి మనుషుల కథ ఏంటీ? అనేది తెలియాలంటే ఈ హనీని చూడాల్సిందే.
విశ్లేషణ:
హనీ ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో దర్శకుడు కరుణ కుమార్ సక్సెస్ సాధించారు. హనీ కథను నడిపిన విధానం చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది.
ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఫస్ట్ హాఫ్ మొత్తం ‘ఇంకేం జరుగుతుంది?’ అనే థ్రిల్లింగ్ ఇంట్రెస్ట్‌తో సాగుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్ దగ్గర వచ్చేసరికి ఎమోషనల్ ప్లే ప్రేక్షకుడిని కుదిపేస్తుంది.
టెక్నికల్ అంశాలు:
సమజాంలో అక్కడక్కడ వినిపించే విషయాలను, అనుమానాలను ఇందులో బాగా చూపించారు. ఆ సీన్లకు అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. సైలెన్స్‌లోనూ భయాన్ని పుట్టించే మ్యూజిక్ ఇది. కెమెరా వర్క్ డార్క్ టోన్‌కు బాగా సరిపోయింది.
లైటింగ్, ఫ్రేమింగ్ అన్నీ కలిసి డార్క్ వాతావరణాన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేస్తాయి. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఒక సీరియస్ థ్రిల్లర్‌ను బాగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు కరుణ కుమార్ తన మార్క్‌ని చూపించారు. ప్రతి సీన్‌ను ఆడియన్స్ లోతుగా ఆలోచింపజేసేలా మలిచిన విధానం మెచ్చుకునే అంశం.
నటీనటులు పర్ఫామెన్స్:
ఇక ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర అదరగొట్టాడు. ఆ పాత్రలో పూర్తిగా జీవించేశాడు. డిఫరెంట్ రోల్స్ సెలెక్షన్స్‌తోపాటు చేయడంలోనూ తాను బెస్ట్ అనిపించుకున్నాడు నవీన్ చంద్ర. అతని కళ్లలో కనిపించే భయం, పిచ్చి, నమ్మకం అన్నీ కలిసి పాత్రను బలంగా నిలబెట్టాయి.
అలాగే, లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా చివరి భాగంలో ఆమె నటన గుండెను తాకుతుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా బిగ్ బాస్ దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. దివిలో ఎప్పుడు చూడని పర్ఫామెన్స్ కనిపిస్తుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే
అలాగే, సారంగపాణిగా సీనియర్ నటుడు రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు. ఫైనల్‌గా చెప్పాలంటే థ్రిల్, భయం కంటే ఆలోచింజచేసే డార్క్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీపై లుక్కేయొచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


