బరాబర్ ప్రేమిస్తా రివ్యూ- బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ రొమాంటిక్ కామెడీ మూవీ మెప్పించిందా?
బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన మరో కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తా. తెలుగు విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ మెప్పించిందా లేదా అనేది నేటి బరాబర్ ప్రేమిస్తా రివ్యూలో తెలుసుకుందాం.
బుల్లితెర మెగాస్టార్‌గా ప్రభాకర్ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన కుమారుడుగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా.

రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీ
టాలీవుడ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీగా తెరకెక్కిన బరాబర్ ప్రేమిస్తా సినిమాలో చంద్రహాస్‌కు జోడీగా మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా.. గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వేరరావు నిర్మించారు.
అలాగే, బరాబర్ ప్రేమిస్తా మూవీలో మురళిధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అర్జున్ మహి, అభయ్ నవీన్, సునిత మనోహర్, కీర్తి లత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 6) థియేటర్లలో బరాబర్ ప్రేమిస్తా సినిమా విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి బరాబర్ ప్రేమిస్తా రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఇది ఒక గ్రామీణ ప్రేమకథ. ఊరిలో అందరితో సరదాగా ఉండే ఒక కుర్రాడు చందు (చంద్రహాస్), అదే ఊరిలోని ఒక అమ్మాయి బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ)తో ప్రేమలో పడతాడు. అయితే, వీరి ప్రేమకు కులం, అంతస్తులు కాకుండా ఊరిలోని కొన్ని గొడవలు అడ్డంకిగా మారతాయి.
ఆ సమస్యలను చందు ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమికురాలిని ఎలా దక్కించుకున్నాడు? అసలు చందు, బుజ్జమ్మ ప్రేమతో ఊరికి వచ్చిన ఇబ్బంది ఏంటీ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
బరాబర్ ప్రేమిస్తా ఒక సింపుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ సినిమా. దీనికి కామెడీ, యాక్షన్, బంధాలు, రొమాన్స్ వంటి అంశాలను యాడ్ చేశారు. చందు, బుజ్జమ్మ లవ్ ట్రాక్ అంతా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. సీన్లు పర్వాలేదనిపిస్తాయి. మరి డిఫరెంట్‌గా అయితే అనిపించవు.
కానీ, అక్కడక్కడ వచ్చే కామెడీ ట్రాక్ పర్వాలేదనిపించేలా నవ్విస్తుంది. ఆ తర్వాత చందు, బుజ్జమ్మల ప్రేమ విషయం ఊరి వాళ్లకు తెలియడం, దాని వల్ల ఇద్దరు ఫేస్ చేసే ఇబ్బందులతో సినిమా సాగిన తీరు బాగానే ఉంది. అయితే, చందు, బుజ్జమ్మ ఫిజికల్ అవడం గురించి అబ్బాయి కులం వాళ్లు మాట్లాడుకోవడం, హీరోయిన్ లేచిపోవడం గురించి చెప్పినప్పుడు ఇతరులు మెచ్చుకోవడం వంటి సీన్స్ కాస్తా ఎబ్బెట్టుగా ఉన్నాయి.
కొన్ని నాన్ సింక్ సీన్స్ పడ్డాయి. ఇక క్లైమాక్స్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అక్కడక్కడ బాగుంది. కొన్ని చోట్ల షార్ట్ ఫిల్మ్ తరహాలో కనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువల్లో ఇంకాస్తా కేర్ తీసుకోవాల్సింది. బీజీఎమ్ ఓకే. పాటలు అంతగా కనెక్ట్ కావు. కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగా లేదనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల ప్రతిభ
చంద్రహాస్ యాక్టింగ్ పర్వాలేదు. డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త పరిణతి సాధించాల్సి ఉంది. ఇక బుజ్జమ్మగా చేసిన కొత్త హీరోయిన్ మేఘన ముఖర్జీ నటనతో ఆకట్టుకుంది. గ్లామర్‌తో అలరించడంతోపాటు ప్రేమికురాలిగా న్యాయం చేసింది.
ఫైనల్‌గా చెప్పాలంటే
అలాగే, విలన్‌గా అర్జున్ మహీ బాగా మెప్పించాడు. అతని నటన మెప్పిస్తుంది. ఇతర పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే పక్కా రూరల్ లవ్ స్టోరీ సినిమా. చంద్రహాస్ యాక్టింగ్ ఎలా ఉందో చూడాలనుకునేవారు ఓ లుక్కేయొచ్చు.
రేటింగ్ 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


