హీరోతో బ్రేకప్ తర్వాత కల్కి హీరోయిన్ దిశా పటానీతో డేటింగ్- మనసులో మాట బయటపెట్టిన సింగర్ తల్విందర్- అసలు కథ ఇదేనట!

బాలీవుడ్ హాట్ బ్యూటీ, కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశాపటానీ, పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్ మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. వీరిద్దరి డేటింగ్ వార్తలు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన వేళ సింగర్ తల్విందర్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Published on: Feb 5, 2026, 09:55:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హాట్ బ్యూటీ, ప్రభాస్ కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ తర్వాత ఆమె సింగిల్‌గానే ఉంటున్నారని అందరూ భావించారు.

హీరోతో బ్రేకప్ తర్వాత కల్కి హీరోయిన్ దిశా పటానీతో డేటింగ్- మనసులో మాట బయటపెట్టిన సింగర్ తల్విందర్- అసలు కథ ఇదేనట!
హీరోతో బ్రేకప్ తర్వాత కల్కి హీరోయిన్ దిశా పటానీతో డేటింగ్- మనసులో మాట బయటపెట్టిన సింగర్ తల్విందర్- అసలు కథ ఇదేనట!

అయితే, గత కొద్ది రోజులుగా పంజాబీ గాయకుడు తల్విందర్ సింగ్ సిద్ధూ (Talwiinder)తో దిశా సన్నిహితంగా కనిపిస్తుండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ పుకార్లపై తాజాగా తల్విందర్ స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్ సిద్ధూ.

ఆ వార్తలు ఆశ్చర్యపరిచాయి

దిశా పటానీతో డేటింగ్ గురించిన వార్తలపై 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్విందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"మేము ఒకరికొకరు పెళ్లికి (నుపుర్ సనన్ వివాహం) కొద్ది రోజుల ముందే పరిచయమయ్యాం. అప్పుడే మాపై ఇంత స్థాయిలో అందరి దృష్టి పడుతుందని మేం అస్సలు ఊహించలేదు. ఇలాంటి వార్తలు లేదా ఒత్తిళ్లకు లోను కావాలని మేం అనుకోవడం లేదు. ప్రస్తుతం మా గురించి మేమే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది. పుకార్లు పుట్టించేవారు పుట్టిస్తూనే ఉంటారు, నేను వాటిని అలాగే వదిలేస్తాను" అని తల్విందర్ పేర్కొన్నారు.

మరి మీకు ప్రేమపై నమ్మకం ఉందా? అని అడగగా.. "నేను ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను" అంటూ ఒక చిలిపి సమాధానమిచ్చారు తల్విందర్ సింగ్.

ఎక్కడ మొదలైందంటే?

ఉదయ్‌పూర్‌లో జరిగిన హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ వేడుకల్లో దిశా, తల్విందర్ జోడీగా కనిపించడంతో మొదటిసారి ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ముంబైలో జరిగిన 'లోలపాలూజా ఇండియా 2026' మ్యూజిక్ ఫెస్టివల్‌లో వీరిద్దరూ చేతులు పట్టుకుని నడుచుకుంటూ రావడంతో, వీరు తమ బంధాన్ని అధికారికం చేసేశారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

దిశా కెరీర్ ముచ్చట్లు..

ఇదిలా ఉంటే, గతంలో ఆరేళ్ల పాటు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్న దిశా పటానీ 2022లో ఆయనతో విడిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే, దిశా పటానీ త్వరలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 'ఓ రోమియో' (O Romeo) చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.

తల్విందర్ సింగ్ కూడా తనదైన శైలిలో సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్నారు. 2022లో 'కమ్మో జీ', 'ధుంధాలా' వంటి హిట్స్‌తో వైరల్ అయిన తల్విందర్ 2024లో 'మిస్‌ఫిట్' అనే తన డెబ్యూ ఆల్బమ్‌ను కూడా విడుదల చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More