చాహల్‌తో డేటింగ్ పుకార్లు, ఏఐ పోస్టర్ వైరల్- అసహ్యంగా ఉందంటూ షెఫాలీ బగ్గా పోస్ట్- క్రికెటర్ సెటైరికల్ కౌంటర్

క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో తనను ముడిపెడుతూ వస్తున్న వార్తలపై బిగ్ బాస్ ఫేమ్ షెఫాలీ బగ్గా తీవ్రంగా స్పందించారు. వైరల్ అవుతున్న ఏఐ (AI) పోస్టర్లను అసహ్యకరమైనవిగా అభివర్ణిస్తూ, ట్రోలర్ల తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. దీంతో షెఫాలీ పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Feb 1, 2026, 18:58:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గత నెలలో బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, జర్నలిస్ట్ షెఫాలీ బగ్గాతో కలిసి చాహల్ ముంబైలో కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికారు చేశాయి.

చాహల్‌తో డేటింగ్ పుకార్లు, ఏఐ పోస్టర్ వైరల్- అసహ్యంగా ఉందంటూ షెఫాలీ బగ్గా పోస్ట్- క్రికెటర్ సెటైరికల్ కౌంటర్
చాహల్‌తో డేటింగ్ పుకార్లు, ఏఐ పోస్టర్ వైరల్- అసహ్యంగా ఉందంటూ షెఫాలీ బగ్గా పోస్ట్- క్రికెటర్ సెటైరికల్ కౌంటర్

అయితే, ఈ పుకార్లకు తోడు 'కిస్ కిస్కో ప్యార్ కరూన్' సినిమా తరహాలో రూపొందించిన కొన్ని ఏఐ (AI) పోస్టర్లు నెట్టింట వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వైరల్ పోస్టర్లలో చాహల్ పక్కన ఆయన భార్య ధనశ్రీ వర్మతో పాటు ఆర్జే మహ్వాష్, షెఫాలీ బగ్గా ఫోటోలను చేర్చారు. దీనిపై షెఫాలీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ట్రోలర్లపై షెఫాలీ ఆగ్రహం

శనివారం (జనవరి 31) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "ఇది చాలా అసహ్యంగా ఉంది! అమ్మాయిల పట్ల ట్రోలర్లు ప్రవర్తించే తీరు సిగ్గుచేటు. ముందు మీ జీవితాల మీద దృష్టి పెట్టండి. మన సమాజంలోని వికృత మనస్తత్వానికి ఇదొక నిదర్శనం" అంటూ ఘాటుగా స్పందించారు షెఫాలీ బగ్గా.

చాహల్ సెటైరికల్ రియాక్షన్

గ్రాఫిక్ డిజైనర్ విజయ్ కుమార్ బరియా సృష్టించిన ఈ పోస్టర్లు స్వయంగా చాహల్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన వీటిని సీరియస్‌గా తీసుకోకుండా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు.

"అడ్మిన్.. ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలిపోయారు. వచ్చేసారి కొంచెం రీసెర్చ్ చేసి పోస్టర్లు వేయి" అంటూ చాహల్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఒరిజినల్ పోస్ట్‌ను సదరు డిజైనర్ తొలగించారు.

అసలేం జరిగింది?

ఇదిలా ఉంటే, గత నెలలో యుజ్వేంద్ర చాహల్, షెఫాలీ ముంబైలో ఒక డిన్నర్ మీటింగ్ తర్వాత కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫ్యాన్ పేజీల్లో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలో ఆర్జే మహ్వాష్‌తో కూడా చాహల్ పేరు వినిపించింది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ పుకార్లు మరింత పెరిగాయి.

షెఫాలీ బగ్గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ (Shefali Bagga/Instagram)
షెఫాలీ బగ్గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ (Shefali Bagga/Instagram)

నిజానికి చాహల్, ధనశ్రీ వర్మల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, వారు విడిపోతున్నారని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వస్తుంటాయి. కానీ, అవన్నీ కేవలం పుకార్లేనని ఈ దంపతులు పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని వాడుకుని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా పోస్టర్లు సృష్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More