మైక్ ఉందని ఏది పడితే అది అడుగుతారా? గౌరవం ఇవ్వనట్లే.. లేడీ జర్నలిస్ట్ పై సిద్ధు జొన్నలగడ్డ ఫైర్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు కోపమొచ్చింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారా? అది రెస్పెక్ట్ ఇవ్వనట్లేననే ఫైర్ అయ్యాడు. తెలుసు కదా మూవీ పబ్లిక్ ఈవెంట్లో అడిగిన ఓ ప్రశ్న కారణంగా సిద్ధు ఈ కామెంట్లు చేశాడు.
తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు కోపమొచ్చింది. ఈ యంగ్ హీరో ఓ లేడీ జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యాడు. మూవీ పబ్లిక్ ఈవెంట్లో అడిగిన ఓ ప్రశ్న కారణంగా సిద్ధుకు కోపమొచ్చింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది అడుగుతారా? రెస్పెక్ట్ ఇవ్వనట్లేననే సిద్ధు ఫైర్ అయ్యాడు.

ఏం జరిగిందంటే?
రీసెంట్ గా తెలుసు కదా మూవీ పబ్లిక్ ఈవెంట్ జరిగింది. ఇందులో ఓ మహిళా జర్నలిస్ట్ సిద్ధు జొన్నలగడ్డను ఓ ప్రశ్న అడిగింది. ‘‘నిజ జీవితంలో కూడా మీరు వుమెనైజరా?’’ అని ప్రశ్నించింది. వుమెనైజర్ అంటే వేర్వేరు అమ్మాయిలతో లైంగిక లేదా రొమాంటిక్ రిలేషన్ షిప్ పెట్టుకునే పురుషుడు అనే అర్థముంది. ఈ ప్రశ్న వినగానే సిద్ధు జొన్నలగడ్డ షాక్ అయ్యాడు. అయినప్పటికీ ప్రశాంతంగానే ఉన్నాడు. ‘‘ఈ ఈవెంట్ నా ఫిల్మ్ గురించా? లేదా నా పర్సనల్ లైఫ్ గురించా’’ అని టాపిక్ ఎండ్ చేశాడు.
మైక్ ఉందని
సిద్ధు జొన్నలగడ్డను ఆ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆ విషయాన్ని ఇక్కడి జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీనికి సమాధానమిస్తూ సిద్ధు జొన్నలగడ్డ ఆ అమ్మాయిపై ఫైర్ అయ్యాడు.
‘‘చేతిలో మైక్ ఉందంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా అడగాలని కాదు. అది చాలా అగౌరవంగా ఉంటుంది. ఇది టాక్సిక్ ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేస్తుంది’’ అని సిద్ధు అన్నాడు.
ఏం రియాక్టవాలి?
‘‘ఆమె అడిగింది వినపడింది కానీ ఏం మాట్లాడతాం. చాలా డిస్ రెస్పెక్టబుల్ అలా మాట్లాడటం. మైక్ ఉంది కదా అని చెప్పి, అలాగే నవ్వుతుంది కూడా. మైక్ ఉంది కదా అని చెప్పి అలా మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది. ఇంకా నేను దాని గురించి ఏం రియాక్టవుతాను. సినిమా కంటెంట్ గురించి మాట్లాడితే బెటర్. రేసులో ఉందా లేదా అనే పరిస్థితి నుంచి మూవీకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి’’ అని సిద్ధు చెప్పాడు.
అది సినిమా
‘‘సినిమాలో హీరో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయితే రియల్ లైఫ్ లో కూడా గన్ పట్టుకుని తిరుగుతాడా? సినిమాలో డ్రగ్ అడిక్ట్ అయితే రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారా? కాదు కదా. అది సినిమా అనే విషయం మర్చిపోతున్నారు. ఇలా మాట్లాడటం కూడా వేస్ట్’’ అని సిద్ధు ఫైర్ అయ్యాడు.
‘‘వాళ్లకు వాళ్లు రియలైజ్ అవ్వాలి. ఎవరైతే నన్ను ప్రశ్న అడిగిందో ఆమె పేరు కూడా నాకు తెలియదు. అయిదు నిమిషాల కంటే ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేసింది. అక్కడ కూర్చుని మైక్ పట్టుకోగానే మారిపోయింది. ఏదో పవర్ వచ్చినట్లు, మేం సమాధానం చెప్పాలి కాబట్టి ఏదంటే అది అడుగుతారు’’ అని సిద్ధు పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












