శ్రేయాస్ మీడియా గిన్నిస్ రికార్డు.. విజయవాడ ఉత్సవ్ గ్రాండ్ సక్సెస్.. దేశవ్యాప్తంగా కార్నివాల్స్
శ్రేయాస్ మీడియా విజయవాడ ఉత్సవ్ తో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సినిమాల ప్రమోషన్లు, ఈవెంట్లు నిర్వహించే ఈ సంస్థ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్నివాల్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది.
విజయవాడ ఉత్పవ్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ కార్నివల్‌గా అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్శించింది. లక్షలాది మందిని ఒకే వేదికపైకి తెచ్చిన ఈ అపురూప వేడుక ద్వారా శ్రేయాస్ మీడియా తన సత్తా చాటింది. మూవీ ప్రమోషన్స్, ఈవెంట్స్ కంపెనీగా 3 వేలకుపైగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి భారత్‌తోపాటు యూఎస్‌ఏ, కెనడా, యూఏఈకి విస్తరించిన ఈ సంస్థ.. కార్నివాల్స్ ద్వారా బిహు, ఓనం, గణేష్ చతుర్థి, పొంగల్, లోహ్రి, దుర్గా పూజ, సంక్రాంతి లాంటి ప్రాంతీయ పండగలకు కొత్త శోభ తేవాలని నిర్ణయించింది.

ఏడాదంతా వేడుకలు..
విదేశీ కళాకారులతో ఏపీలోని అరకు, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని శ్రేయాస్ మీడియా నిర్ణయించింది. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఈ సంక్రాంతికి రైతు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనుంది. విజయవాడ ఉత్సవ్ స్థాయిలో వైజాగ్, తిరుపతిలో న్యూ ఇయర్, సంక్రాంతి, విజయవాడలో న్యూ ఇయర్, సంక్రాంతి, దీపావళి వేడుకలు జరుపనుంది. ఏడాదంతా 30 భారీ కాన్సర్ట్స్ చేయనుంది. అరకు కాఫీ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనుంది.
పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన విజయవాడ ఉత్పవ్ ద్వారా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ చేశామని శ్రేయాస్ మీడియా ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు తెలిపారు. ‘భారత్ అంటేనే ఒక ఉత్సవం. విభిన్న సంస్కృతుల సమ్మేళనం. వివిధ రాష్ట్రాల్లో విజయవాడ ఉత్సవ్ వంటి కార్నివాల్స్ నిర్వహించడం ద్వారా పండగలు చిరస్మరణీయం చేయవచ్చు. దేశ, విదేశాల్లో ఉన్నవారిని ఒకే వేదికపైకి తీసుకురావొచ్చు. జనంలో మన దేశం, మన రాష్ట్రం, మన పండగ అన్న భావనను నింపొచ్చు. అంతేకాదు కార్నివల్‌ను తిలకించేందుకు లక్షలాది మంది రాకతో స్థానిక ఎకానమీ వృద్ధి చెందుతుంది. వేలాది బ్రాండ్స్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదాయం సమకూరుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది’ అని చెప్పారు.
గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం ద్వారా విజయవాడ ఉత్సవ్ ప్రపంచ పర్యాటక పటంలో నిలిచిందని, అమరావతి కీర్తి కిరీటంగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కితాబిచ్చారని ఆయన గుర్తు చేశారు.
అన్నీ రికార్డులే..
సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ టూరిజంతో కలిసి విజయవాడ ఉత్పవ్‌కు శ్రేయాస్ మీడియా శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 22న ప్రారంభమై 11 రోజులపాటు సాగిన విజయవాడ ఉత్సవ్ 284 ఈవెంట్స్‌తో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. విజయవాడ వీధుల్లో 3,000 మంది కళాకారులతో రంగుల మయం చేసి లక్షలాది మంది వీక్షకులకు కనువిందు చేసింది. ప్రపంచంలో తొలిసారిగా 11 రోజులపాటు 11 కాన్సర్ట్స్, 11 డ్రోన్ షోస్ నిర్వహించి దసరా పండగకు మరింత శోభను తెచ్చింది.
నాలుగు రోజులపాటు క్రాకర్స్ షో ద్వారా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించింది. తెలుగువారినే కాదు ఇతర రాష్ట్రాలకు చెందినవారినీ ఈ ఉత్సవ్ ఆకట్టుకుందని శ్రీనివాస్ తెలిపారు. కార్నివాల్ విజయవంతం చేయడంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అహర్నిశలు శ్రమించారని చెప్పారు. అలాగే సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ముఖ్య భూమిక పోషించిందని తెలిపారు.
రూ.1,000 కోట్ల వ్యాపారం..
సాధారణంగా దసరా సందర్భంగా విజయవాడకు 15 లక్షల మంది వస్తారు. ఈసారి విజయవాడ ఉత్సవ్ ద్వారా బ్రాండ్ క్రియేట్ అయిందని శ్రీనివాస్ తెలిపారు. ‘దాదాపు 50 లక్షల మంది విజయవాడకు వచ్చారు. స్థానికంగా రూ.1,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. విజయవాడ ఉత్సవ్‌లో 15 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించింది.
విజయవాడ ఎక్స్‌పోలో 600 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. వచ్చే అయిదేళ్లలో విజయవాడ ఉత్సవ్ ద్వారా రూ.5,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే దేశంలో అన్ని నగరాల్లో ఇటువంటి కార్నివాల్స్ నిర్వహించేందుకు శ్రేయాస్ మీడియా సిద్ధం. బ్రాండ్స్ సైతం మద్దతు తెలిపేందుకు ముందుకు వస్తున్నాయి. మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు దక్కించుకుని వేలాది బ్రాండ్స్‌ను కోట్లాది మందికి చేరువ చేశాం’ అని వివరించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


