బిగ్ బాస్ అమర్‌దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం- సుమతి సుమతి సాంగ్ రిలీజ్- ఆకట్టుకునేలా డ్యాన్స్ స్టెప్స్

బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా సుమతీ శతకం. తాజాగా సుమతీ శతకం మూవీ నుంచి సుమతి సుమతి సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో అమర్‌దీప్ చౌదరి డ్యాన్స్ స్టెప్స్ సింపుల్‌గా ఉంటూనే ఆకట్టుకుంటునేలా ఉన్నాయి.

Published on: Jan 25, 2026, 11:18:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా రూపొందించిన సినిమా సుమతీ శతకం. ఈ సినిమాకు ఎంఎం నాయుడు రచన దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల ముందుకు రానున్న సుమతీ శతకం మూవీలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బిగ్ బాస్ అమర్‌దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం- సుమతి సుమతి సాంగ్ రిలీజ్- ఆకట్టుకునేలా డ్యాన్స్ స్టెప్స్
బిగ్ బాస్ అమర్‌దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం- సుమతి సుమతి సాంగ్ రిలీజ్- ఆకట్టుకునేలా డ్యాన్స్ స్టెప్స్

సుమతీ శతకం కీలక పాత్రలు

అలాగే, సుమతీ శతకం మూవీలో వీరితోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ల గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.

ఇప్పటికే సుమతీ శతకం నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా సుమతీ శతకం సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న సుమతీ శతకం నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు.

సుభాష్ ఆనందం సంగీతం

సమతీ శతకం నుంచి "సుమతి సుమతి..." అనే పాటను విడుదల చేశారు. కృష్ణ మాదినేని రాసిన ఈ పాటకు గోల్డ్ దేవరాజ్ స్వరాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చారు. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ ఈ పాటను మరింత వినసంపుడిగా మార్చిందని చిత్రబృందం పేర్కొంది.

"నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ..." అంటూ సాగిన ఈ సాంగ్ విజువల్స్ చూస్తే అమర్‌దీప్ చౌదరి తాను ప్రేమించిన అమ్మాయి గురించి పాడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పాటలో అమర్‌దీప్ చౌదరి వేసిన డాన్స్ స్టెప్స్ కూడా సింపుల్‌గా ఉంటూనే సరికొత్తగా ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి.

ప్రేయసిని తలుస్తూ పాడే పాట

ముందు ముందు యువత తమ ప్రేయసిని తలుస్తూ పడేలా ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే సుమతీ శతకం నుంచి విడుదలైన 'ఎక్కడే ఎక్కడే' పాట కూడా ప్రేక్షకుల పట్ల చక్కటి స్పందనను అందుకుంది. ఇప్పుడు సుమతి సుమతి సాంగ్ కూడా ఆదరణ పొందుతుని నమ్మకంగా ఉన్నారు దర్శకనిర్మాతలు.

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ చౌదరి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ షోలో తనదైన ఆట తీరుతో, జెన్యూన్‌గా అన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు సీరియల్స్‌లో అమర్‌దీప్ హీరోగా చేశాడు.

హీరోగా అమర్‌దీప్ చౌదరి ఎంట్రీ

జానకి కలగనలేదు సీరియల్‌లో మెయిన్ లీడ్ చేసిన అమర్‌దీప్ ఇప్పుడు వెండితెరపై అడుగుపెడుతున్నాడు. సుమతీ శతకం సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో అమర్‌దీప్ చౌదరి ఎంట్రీ ఇవ్వడం విశేషంగా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More