డ్రోన్స్‌తో శ్రీ కృష్ణుడి వ్యవసాయం- మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాంథమ్ సాంగ్ రిలీజ్-ఆకట్టుకునేలా సింగర్ బాబా సెహగల్ వాయిస్!
టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. తాజాగా ఈ సినిమా నుంచి యాంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, బ్యూటిపుల్ పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించిన సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నటుడు అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ మూవీకి మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు.

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్
సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఇదివరకు విడుదలైన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా యాంథమ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో శ్రీ కృష్ణుడు డ్రోన్స్‌తో వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది. ప్రకాష్ చెరుకూరి అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రాణం పోసింది.
బాబా సెహగల్ వాయిస్
ఈ పాటను పాపులర్ సింగర్ బాబా సెహగల్ ఆలపించారు. బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో ఈ పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది.
అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ పాట యూత్‌తో పాటు ప్రతి వర్గం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా నిలిచింది.
ఇదిలా ఉంటే, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రానికి రవికుమార్ డీవోపీగా, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
కాగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాలో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లాతోపాటు శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు ఇతర పాత్రలు పోషించారు.
ఇండస్ట్రీలో ఉండేందుకు కారణం
ఇక ఇటీవల నిర్వహించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్‌గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని అన్నారు.
"చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది" అని మధుదీప్ తెలిపారు.
"ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా ఉంటుంది. హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. 5 ఏళ్ల జర్నీ. మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము" అని డైరెక్టర్ మధుదీప్ పేర్కొన్నారు.
చిరునవ్వు ఎక్కడికిపోదు
"బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు" అని దర్శకుడు మధుదీప్ చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












