వ్యవయసాయం చేసే విధానం మారితే చూసే తీరు మారుతుంది-ఆకట్టుకునేలా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్-టికెట్ ధరలపై హీరో త్రిగుణ్
వ్యవసాయంపై తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు రూరల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. ఇవాళ గ్రాండ్‌గా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ రిలీజ్ చేశారు. ఆ విశేషాల్లోకి వెళితే..!
హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ రిలీజ్
అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం అందించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్‌ను ఇవాళ (జనవరి 4) గ్రాండ్‌గా లాంచ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. వ్యవసాయం, ప్రకృతి వంటి అంశాలపై ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఆకట్టుకునేలా డైలాగ్స్
టీజర్‌లో విజువల్స్, మ్యూజిక్, డైలాగ్స్ బాగున్నాయి. 'వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం మారుతుంది' వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
ఒక హోప్ వచ్చింది
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. "ఈ వేడుకకి విచ్చేసిన అతిధులు అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి. అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు థియేటర్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.
తక్కువ ధరల్లో టికెట్స్
"బాబ్జి గారికి థాంక్యూ. తక్కువ ధరల్లో టికెట్స్ పెడితే ఆడియన్స్ అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం" అని హీరో త్రిగుణ్ తెలిపాడు.
వెనక్కి తిరిగి చూసుకుంటే
"మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది" త్రిగుణ్ పేర్కొన్నాడు.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ డేట్
"ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. త్వరలోనే మిస్టర్ వర్క్ ఫ్రమో హోమ్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని తన స్పీచ్ ముగించాడు హీరో త్రిగుణ్.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నటీనటులు
ఇదిలా ఉంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


