న్యూడ్‌గా దర్శనమిచ్చిన హీరో చైతన్య రావు- టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగా- ఏ నేక్డ్ ట్రూత్ అంటూ!
హీరో చైతన్య రావు మదాడి న్యూడ్‌గా దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దిల్ దియా సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. ఏ నేక్డ్ ట్రూత్ అనేది ట్యాగ్ లైన్. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..!
వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో చైతన్య రావు మదాడి. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమానే వెర్సటైల్ డైరెక్టర్ కె. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్.

సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా
శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు దిల్ దియా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న దిల్ దియా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను అభినందించారు.
న్యూడ్‌గా హీరో
ఇక దిల్ దియా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. హీరో చైతన్య రావు ఒంటి మీద బట్టలు లేకుండా సొఫాలో కూర్చుని ఉన్నాడు. తను రగ్డ్ లుక్‌తో స్క్రీన్‌ను సీరియస్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. చైతన్య రావు చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్ అయే అబ్జల్యూట్ సినిమా అనే మీమ్ ఫొటో పోస్టర్ వెనుకాల స్క్రీన్ లైటింగ్ దగ్గర ఉండటం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హీరో చైతన్య రావు న్యూడ్‌గా కనిపించడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్
దిల్ దియా టైటిల్, పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ.. "డిఫరెంట్ కాన్సెప్ట్స్, సెన్సిబుల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు.. మరోసారి ‘దిల్ దియా’తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి సిద్ధమవుతున్నారు" అని అన్నారు.
అన్ని ఎమోషన్స్
"చైతన్య రావు మదాడిని న్యూ అవతార్‌లో చూడబోతున్నారు. రా ఎమోషన్స్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్‌ను సినిమాటిక్ లాంగ్వేజ్‌లో దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ‘దిల్ దియా’ను సమ్మర్‌లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం" అని ప్రొడ్యూసర్ పూర్ణ నాయుడు తెలిపారు.
దిల్ దియా నటీనటులు
ఇదిలా ఉంటే, ఈ దిల్ దియా సినిమాలో చైతన్య రావుతోపాటు ఇరా సఖి, జెస్సీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, చైతన్య రవు యూట్యూబ్ పాపులర్ సిరీస్ 30 వెడ్స్ 21తో బాగా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వెండితెరపై నటుడుగా ప్రయాణం మొదలుపెట్టిన చైతన్య రావు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
విలన్ నుంచి ఓటీటీ సిరీస్ దాకా
అలాగే, గతేదాడి అనుష్క శెట్టి మెయిన్ రోల్‌లో నటించిన ఘాటి సినిమాలో విలన్‌గా కూడా చైతన్య రావు మెప్పించాడు. ఇవే కాకుండా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మయసభ ఓటీటీ సిరీస్‌లోనూ నటించాడు చైతన్య రావు. ఇప్పుడు న్యూడ్ లుక్‌తో దర్శనమిచ్చి మాస్ అవతార్‌తో రానున్నాడు చైతన్య రావు మదాడి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


