మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు, ప్రతి ఒక్కరికి దానిపై ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన: హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ

తెలుగు హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ నటించిన మరో సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగుణ్ హీరోగా చేసిన ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. ఇటీవల మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది హీరోయిన్ పాయల్.

Published on: Jan 5, 2026, 21:20:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది బ్యూటిపుల్ ముద్దుగుమ్మ పాయల్ రాధాకృష్ణ. అలా నిన్ను చేరి, ప్రసన్నవదనం, చౌర్యపాఠం వంటి సినిమాలతో ఆకట్టుకున్న పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.

మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు, ప్రతి ఒక్కరికి దానిపై ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన: హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ
మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు, ప్రతి ఒక్కరికి దానిపై ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన: హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ రిలీజ్

యంగ్ హీరో త్రిగుణ్‌తో పాయల్ రాధాకృష్ణ జోడీ కట్టిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకు మధుదీప చెలికాని కథ, దర్శకత్వం వహించారు. అరవింద్ మండెం నిర్మించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ.

వ్యవసాయం మీద

పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిల్మ్. కానీ, పూర్తవ్వడానికి ఈ టైమ్ పట్టింది. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. కథ చెప్పినప్పుడు నేను చాలా పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా గ్రామాల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను" అని తెలిపింది.

ఇండస్ట్రీలో ఉండటానికి కారణం

డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్‌గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని అన్నారు.

ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుదంటే

"చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అని చెప్పారు డైరెక్టర్ మధుదీప్ చెలికాని.

హత్తుకునేలా ఉంటుంది

"తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా ఉంటుంది. హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మాది 5 ఏళ్ల జర్నీ. మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము" అని డైరెక్టర్ వెల్లడించారు.

చిరునవ్వు ఎక్కడికి పోదు

"బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు" అని మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ దర్శకుడు మధుదీప్ చెలికాని ధీమా వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More