ఇది నా జోనర్ కదా అనుకున్నా.. కానీ, మూవీ చూసి షాక్ అయ్యాను.. చిరంజీవి విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవితో బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న వశిష్ట రీసెంట్‌గా జరిగిన ఆది సాయి కుమార్ శంబాల సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ వశిష్ట. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Jan 4, 2026, 06:38:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో లేటెస్ట్‌గా వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం శంబాల. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఇది నా జోనర్ కదా అనుకున్నా.. కానీ, మూవీ చూసి షాక్ అయ్యాను.. చిరంజీవి విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్
ఇది నా జోనర్ కదా అనుకున్నా.. కానీ, మూవీ చూసి షాక్ అయ్యాను.. చిరంజీవి విశ్వంభర డైరెక్టర్ వశిష్ట కామెంట్స్

అతిథిగా డైరెక్టర్ వశిష్ట

ఈ నేపథ్యంలోనే ఇటీవల శంబాల విజయోత్సవం పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ డైరెక్టర్ వశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో విశ్వంబర డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ .. "సాయి కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో హిట్టు కొట్టారు. ఆది ఏడాది చివర్లో హిట్ కొట్టారు. ‘శంబాల’ టీజర్, ట్రైలర్ చూసి ఇది నా జోనర్ కదా? అని అనుకున్నాను. ‘శంబాల’ మూవీ చూసి నేను షాక్ అయ్యాను" అని అన్నారు.

ఎక్కడ పేలిపోతుందో అని

"శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సౌండింగ్ ఇచ్చారు. సుషుమ్న నాడి ఎక్కడ పేలిపోతుందో అని భయపడ్డాను. ఇంత పెద్ద హిట్ కొట్టిన దర్శక, నిర్మాతలకు కంగ్రాట్స్" అని డైరెక్టర్ వశిష్ట చెప్పారు.

ఇదే ఈవెంట్‌లో శంబాల నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ .. "శంబాల మూవీని పరిమిత బడ్జెట్‌లోనే తీయాలని అనుకున్నాం. కానీ, యుగంధర్ ముని అవుట్ పుట్ చూసి ఎంతైనా ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయ్యాం. ఆది గారి సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్" అని అన్నారు.

రెండో వారంలో ఎక్కువ కలెక్షన్స్

మరో నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు మాట్లాడుతూ .. "శంబాల మూవీ ఆడియెన్స్ అందరికీ నచ్చింది. సెకండ్ వీక్‌లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మాకు సపోర్ట్ చేసిన ఆది గారికి, యుగంధర్ గారికి థాంక్స్" అని తెలిపారు.

రచయిత, దర్శకుడు కోన వెంకట్ మాట్లాడుతూ .. "శంబాల నిజంగానే డివైన్ బ్లాక్ బస్టర్. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఆదికి మంచి విజయం దక్కాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. సాయి కుమార్ గారు అందరికీ కావాల్సిన మనిషి. ఇది మా ఇంటి వ్యక్తి సాధించిన విజయంగా అనిపిస్తుంది" అని అన్నారు.

మునిలా తపస్సు చేశారు

"ఆదితో నేను చేసిన ఓటీటీ సిరీస్ ‘పులి మేక’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు ఆది సక్సెస్ కొట్టడం ఆనందంగా ఉంది. ఓ మునిలా యుగంధర్ ముని తపస్సు చేసి ఈ మూవీని తీశాడు. ప్రతీ ఒక్క పాత్రని అద్భుతంగా రాశాడు. అందరి టాలెంట్ నిరూపించిన కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇలాంటి కొత్త, కంటెంట్ ఉన్న చిత్రాలు మరిన్ని రావాలి" అని కోరారు రైటర్ కోన వెంకట్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More