పుర్రె, ఎముకలతో బైక్- అదిరిపోయిన ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్- వరుణ్ సందేశ్, వితిక, సాయి కుమార్, సుమన్ కీలక పాత్రలు

వరుణ్ సందేశ్, అతని భార్య వితిక షెరు, సాయి కుమార్, సుమన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ధర్మస్థల నియోజకవర్గం. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పుర్రె, ఎముకలతో బైక్ ఉన్న ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

Published on: Jan 2, 2026, 12:58:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్. ఇటీవల నయనం సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌తోపాటు ఆయన భార్య, బిగ్ బాస్ బ్యూటి వితికా షెరు కూడా యాక్ట్ చేసింది.

పుర్రె, ఎముకలతో బైక్- అదిరిపోయిన ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్- వరుణ్ సందేశ్, వితిక, సాయి కుమార్, సుమన్ కీలక పాత్రలు
పుర్రె, ఎముకలతో బైక్- అదిరిపోయిన ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్- వరుణ్ సందేశ్, వితిక, సాయి కుమార్, సుమన్ కీలక పాత్రలు

సీనియర్ నటులు సాయి కుమార్, సుమన్

ఆ సినిమానే ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ధర్మస్థల నియోజకవర్గం మూవీలో వరుణ్ సందేశ్, వితికా షెరుతోపాటు సీనియర్ నటులు సుమన్, సాయి కుమార్, నటరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. మేరు భాస్కర్ నిర్మించిన ఈ సినిమా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. "మా చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయి కుమార్, సుమన్‌లతోపాటు యంగ్ హీరోస్ కూడా నటించారు. మంచి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది" అని అన్నారు.

అదే స్పెషల్ అట్రాక్షన్

"చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్‌కు సింగర్ సునీత గారు వినసొంపైన వాయిస్ ఇచ్చారు. అన్ని హంగులతో ధర్మస్థల నియోజకవర్గం సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం " అని తెలిపారు డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

"తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని ధర్మస్థల నియోజకవర్గం దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట పేర్కొన్నారు.

పుర్రె, ఎముకలతో బైక్

ఇదిలా ఉంటే, ధర్మస్థల నియోజకవర్గం ఫస్ట్ లుక్ అదిరిపోయింది. పుర్రె, ఎముకలతో చూపించిన బైక్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. పుర్రె హెడ్‌లైట్‌గా ఉన్న బైక్ ముందు కొంతమంది పడి ఉన్నట్లు చూపించారు. వారంత స్టూడెంట్స్‌లా అనిపిస్తుంది.

కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో

అలాగే, నా భవిష్యత్, నో ర్యాగింగ్ అనే ప్లకార్డ్స్ కనిపించాయి. బ్యాక్‌డ్రాప్‌‌లో కాలేజ్, స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. ఈ లెక్కన ధర్మస్థల నియోజకవర్గం సినిమాను కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌గా మలిచినట్లు తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More