ఓటీటీలోకి హీరో వరుణ్ సందేశ్ ఎంట్రీ.. సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌గా నయనం.. ఫస్ట్ లుక్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి హీరో వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌గా వెబ్ సిరీస్ వరుణ్ సందేశ్ నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఇవాళ (డిసెంబర్ 1) నయనం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి నయనం ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్, రిలీజ్ డేట్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
హ్యాపీడేస్ సినిమాతో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అనంతరం కుర్రాడు, మరో చరిత్ర, ఇందువదన, నింద, విరాజి వంటి చిత్రాలతో అలరించాడు వరుణ్ సందేశ్.

ఓటీటీలోకి వరుణ్ సందేశ్
ఈ ఏడాది రాచరికం సినిమాలో కనిపించాడు వరుణ్ సందేశ్. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ ఓటీటీ సిరీసే నయనం.
సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్
ఇప్పటికే భిన్నమైన జోనర్స్‌తో అలరించిన వరుణ్ సందేశ్ మరోసారి విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో రానున్నట్లు తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కున్న నయనం వెబ్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించనున్నారు.
నయనం ఫస్ట్ లుక్ రిలీజ్
ఇదిలా ఉంటే, తాజాగా ఇవాళ (డిసెంబర్1) నయనం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. కర్లీ హెయిర్‌తో స్పెక్ట్స్ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న వరుణ్ సందేశ్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సిరీస్‌తో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
6 ఎపిసోడ్స్‌తో సిరీస్
ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ నయనంలో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ పరిచయం కాబోతున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు.
జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్
ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న జీ5 ఇండియాలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి. అలాంటి జీ5 ఓటీటీ మరోసారి తనదైన శైలిలో డిఫరెంట్ ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది. అంటే జీ5లో నయనం ఓటీటీ రిలీజ్ కానుంది.
వరుణ్ సందేశ్ కామెంట్స్
డిసెంబర్ 19 నుంచి జీ5లో నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ ఒరిజినల్ ఫస్ట్ లుక్‌ను జీ5 విడుదల చేసి వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
విభిన్నమైన పాత్రలో
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను. పోస్టర్‌ను గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది" అని అన్నాడు.
జీ5 ఓటీటీలో నయనం
"ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మరింతగా ఎలివేట్ చేసినట్లయ్యింది. డిసెంబర్ 19న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానున్న నయనంను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను" అని వరుణ్ సందేశ్ తెలిపాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


