Sign in

మిస్టరీ మ్యాన్‌తో డేటింగ్- అది ఎవరో కుండ బద్ధలు కొట్టిన హీరోయిన్ మలైకా అరోరా- గే ఫ్రెండ్స్‌తో కూడా సంబంధం అంటూ!

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా అరోరా డేటింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక మిస్టరీ మ్యాన్‌తో ఆమె చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందన్న ప్రచారంపై మలైకా అరోరా తాజాగా స్పష్టతనిచ్చారు. ఇప్పుడు మలైకా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 18, 2026, 10:10:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అర్బాజ్ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో సుదీర్ఘ కాలం డేటింగ్.. ఇలా ఆమె లైఫ్ ఓపెన్ బుక్ అని తెలిసిందే.

మిస్టరీ మ్యాన్‌తో డేటింగ్- అది ఎవరో కుండ బద్ధలు కొట్టిన హీరోయిన్ మలైకా అరోరా- గే ఫ్రెండ్స్‌తో కూడా సంబంధం అంటూ!
మిస్టరీ మ్యాన్‌తో డేటింగ్- అది ఎవరో కుండ బద్ధలు కొట్టిన హీరోయిన్ మలైకా అరోరా- గే ఫ్రెండ్స్‌తో కూడా సంబంధం అంటూ!

అయితే, ఇటీవల అర్జున్‌ కపూర్‌తో బ్రేకప్ తర్వాత మలైకా అరోరా ఎవరితో కనిపించినా ‘మిస్టరీ మ్యాన్’ ఎవరూ అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ మిస్టరీ మ్యాన్‌తో మలైకా అరోరా డేటింగ్ చేస్తోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఆ క్రమంలో ఈ పుకార్లపై మలైకా అరోరా తాజాగా ‘ది నమ్రత జకారియా షో’లో క్లారిటీ ఇచ్చారు.

అర్జున్ నా జీవితంలో భాగమే..

మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించి మలైకా అరోరా మాట్లాడుతూ ఎంతో హుందాగా స్పందించారు. "అర్జున్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. అతడు ఎప్పటికీ నా లైఫ్‌లో అంతర్భాగమే. మా గతం గురించి లేదా భవిష్యత్తు గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇప్పటికే మా ఇద్దరి గురించి మీడియాలో చాలా రాశారు. కావాల్సినంత చర్చ జరిగింది. దానికి ఇంకా మసాలా జోడించడం నాకు ఇష్టం లేదు" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది మలైకా అరోరా.

ఆ మిస్టరీ మ్యాన్ కథేంటంటే?

ఇక తనతో పాటు కనిపిస్తున్న కొత్త వ్యక్తి (మిస్టరీ మ్యాన్) గురించి వస్తున్న వార్తలపై మలైకా అరోరా నవ్వుతూ సమాధానమిచ్చారు. "ప్రజలకు మాట్లాడటం అంటే ఇష్టం. నేను బయటకు వెళ్లినప్పుడు నా పక్కన ఎవరైనా కనిపిస్తే చాలు, అది పెద్ద చర్చకు దారితీస్తుంది. అనవసరమైన ఈ పుకార్లకు నేను ఆజ్యం పోయదలుచుకోలేదు" అని మలైకా అరోరా అన్నారు.

"నిజం చెప్పాలంటే.. నేను బయట అడుగుపెట్టిన ప్రతిసారి నా పాత స్నేహితుడు కావచ్చు, పెళ్లయిన ఫ్రెండ్ కావచ్చు, నా మేనేజర్ కావచ్చు.. చివరకు నా గే ఫ్రెండ్స్‌తో కనిపించినా సరే, వారితో నాకు ముడిపెట్టేస్తున్నారు (సంబంధం)" అని ఆవేదన వ్యక్తం చేశారు మలోకా అరోరా.

ఈ వార్తలు చూసి తన తల్లి కూడా ఆశ్చర్యపోతారని మలైకా అరోరా తెలిపారు. "నా తల్లి ఫోన్ చేసి.. ‘ఎవరు బేబీ వీళ్లు? ఇప్పుడు మళ్లీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు?’ అని అడుగుతుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వింటే నాకు కేవలం నవ్వు మాత్రమే వస్తోంది" అని మలైకా అరోరా పేర్కొన్నారు.

మలైకా ప్రయాణం..

కాగా, 52 ఏళ్ల మలైకా అరోరా 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. 2017లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు.

2016 నుంచి అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్న మలైకా అరోరా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల హీరోతో విడిపోయారు. ప్రస్తుతం మలైకా అరోరా తన కెరీర్, ఫిట్‌నెస్, వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More