50 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్స్- ఇది మహిళా సాధికారత, గర్వంగా ఉందన్న హీరోయిన్ మలైకా అరోరా!
హాట్ ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన వయసుపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. 50 ఏళ్లలోనూ ఐటమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసులోనూ తన గ్లామర్, డ్యాన్స్ మూవ్స్‌తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంటారు. ఇటీవల ఆమె హనీ సింగ్‌తో కలిసి చేసిన ఆల్బమ్, అలాగే ‘థామా’ చిత్రంలో రష్మిక మందన్నాతో చేసిన స్పెషల్ సాంగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

అయితే, ఈ వయసులో ఇలాంటి ‘ఐటమ్ సాంగ్స్’ అవసరమా అంటూ సోషల్ మీడియాలో మలైకా అరోరాపై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మలైకా ఈ విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది మలైక అరోరా.
అందులో తప్పేముంది?
"నేను ఈ ఇమేజ్‌ను ఎందుకు వదులుకోవాలి? దీని గురించి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది?" అని మలైకా సూటిగా ప్రశ్నించారు. "చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, ట్రోల్ చేస్తారు. కానీ, ఇందులో అంత పెద్ద తప్పు ఏముందో నాకు అర్థం కావడం లేదు. డ్యాన్స్ అనేది ఒక కళాత్మక వ్యక్తీకరణ. 50 ఏళ్ల వయసులో కూడా నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నేను గర్వపడుతున్నాను. అంటే నేను ఏదో ఒక విషయంలో సరైన బాటలోనే ఉన్నానని నా నమ్మకం" అని మలైకా అరోరా వివరించారు.
మహిళలకు ఇదొక స్ఫూర్తి ఈ స్టేజ్‌లో డ్యాన్స్ నంబర్లు చేయడం తనకు ఎంతో శక్తినిస్తుందని (Empowering), ఇది మహిళ సాధికారత అని మలైకా పేర్కొన్నారు. "ఇది నాకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నన్ను చూసి బయట ఉన్న మహిళలు కూడా స్ఫూర్తి పొందితే, వారు కూడా ఏదైనా సాధించగలమని భావిస్తే.. నా పని పూర్తయినట్లే. వయసుతో సంబంధం లేకుండా మనకు నచ్చినట్లు ఉండటమే అసలైన విజయం" అని మలైకా ధీమాగా చెప్పారు.
రష్మికను వెనక్కి నెట్టేసిన మలైకా!
ఇకపోతే మలైకా అరోరా కెరీర్‌లో ‘ఛయ్య ఛయ్య’, ‘మున్నీ బద్నామ్’, ‘అనార్కలీ డిస్కో చలీ’ వంటి ఎన్నో ఐకానిక్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. 2025లో వచ్చిన ‘థామ’ చిత్రంలో రష్మిక మందన్నతో కలిసి ‘పాయిజన్ బేబీ’ అనే పాటలో మలైకా మెరిశారు. ఆ పాటలో మలైకా గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
రష్మిక కంటే మలైకానే హైలైట్ అయ్యారంటూ అప్పట్లో కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘చిల్‌గమ్’ అనే మ్యూజిక్ వీడియోలో మలైకా అరోరా చేసిన బోల్డ్ స్టెప్స్ విమర్శలకు దారితీసినా.. ఆమె మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
బుక్ రాస్తున్న మలైకా
కాగా, మలైకా కేవలం డ్యాన్స్‌కే పరిమితం కాకుండా ‘ఇట్స్ ఈజీ టు బి హెల్తీ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఇటీవల ముగిసిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సీజన్ 11కు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, షాన్‌లతో కలిసి మలైకా జడ్జిగా వ్యవహరించారు. ఈ షో ఈ ఏడాది జనవరి 4న ఘనంగా ముగిసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


