ఐటమ్ సాంగ్‌ల ఉండకూడదనే తమన్నాను రెజెక్ట్ చేశారు, కానీ ఫస్ట్ ఛాయిస్ ఆమెనే- డైరెక్టర్‌పై కొరియోగ్రాఫర్- అసలు కారణం చెబుతూ!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా ‘ధురంధర్’. ఈ మూవీలోని ‘షరారత్’ పాటపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పాట కోసం మొదట మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను అనుకున్నారట. కానీ, దర్శకుడు ఆదిత్య ధర్ రెజెక్ట్ చేశారని, అందుకు కారణం ఏంటో కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ వివరించారు.

Published on: Dec 22, 2025, 12:27:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం కథ, యాక్షన్ మాత్రమే కాదు, ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్‌ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా దురంధర్ సినిమాలోని ‘షరారత్’ అనే డ్యాన్స్ నంబర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఐటమ్ సాంగ్‌ల ఉండకూడదనే తమన్నాను రెజెక్ట్ చేశారు, కానీ ఫస్ట్ ఛాయిస్ ఆమెనే- డైరెక్టర్‌పై కొరియోగ్రాఫర్- అసలు కారణం చెబుతూ!
ఐటమ్ సాంగ్‌ల ఉండకూడదనే తమన్నాను రెజెక్ట్ చేశారు, కానీ ఫస్ట్ ఛాయిస్ ఆమెనే- డైరెక్టర్‌పై కొరియోగ్రాఫర్- అసలు కారణం చెబుతూ!

తమన్నాను వద్దన్న దర్శకుడు

బ్యూటిపుల్ ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆడిపాడిన ఈ సాంగ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తాజాగా వెల్లడించారు. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ మొదట మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని అనుకున్నారట. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నారని విజయ్ తెలిపారు.

నా మైండ్‌లో తమన్నానే

"నా మైండ్‌లో ముందు తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే ఈ పాటకు నిండుదనం వస్తుందని, సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు నేను సూచించాను. కానీ, ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది రెగ్యులర్ 'ఐటెమ్ సాంగ్'లా ఉండకూడదని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు" అని విజయ్ గంగూలీ తెలిపారు.

తమన్నాపైనే అందరి దృష్టి

"సినిమా స్టోరీని డిస్టర్బ్ చేసేలా ఏ ఒక్క అంశం కూడా ఉండకూడదన్నదే ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప కథ మీద ఉండదు. సినిమా నుంచి ప్రేక్షకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే ఒకరికి బదులు ఇద్దరు డ్యాన్సర్లను పెడదామని ఆదిత్య నన్ను ఒప్పించారు. అలా అయేషా, క్రిస్టల్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు" అని విజయ్ వివరించారు.

కరాచీలో జరిగి వెడ్డింగ్

కరాచీలో జరిగే ఒక హై-ప్రొఫైల్ వెడ్డింగ్ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. అక్కడి కల్చర్‌కు అనుగుణంగా ఆ పాట తీరు ఉంటుంది. ఒకవేళ తమన్నా ఆ సాంగ్ చేసి ఉంటే తాము అనుకున్నది ప్రేక్షకులు ఫీల్ అవ్వలేకపోవచ్చు అన్న ఆలోచనతో తమన్నాను డైరెక్టర్ ఆదిత్య ధర్ రెజెక్ట్ చేసినట్లుగా విజయ్ గంగూలీ పేర్కొన్నారు.

స్పైగా రణ్‌వీర్ సింగ్

ఇదిలా ఉంటే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా అద్భుత నటన కనబరిచారు. పాకిస్థాన్‌లోని లియారీ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను ఛేదించే ఒక ఇండియన్ ఏజెంట్ కథగా ఈ చిత్రం రూపొందింది.

దురంధర్ కలెక్షన్స్

దురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా చేస్తే సారా అర్జున్ హీరోయిన్‌గా జోడీ కట్టింది. అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రలను పోషించారు. దురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 845 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More