30 ఏళ్ల హీరోయిన్లను అలా చూస్తున్నారు-జ్యూసీ రోల్స్-పిల్లలను కంటాననుకున్నా-వయసు పెరగడం అద్భుతమే: తమన్నా హాట్ కామెంట్లు
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాట్ కామెంట్లు చేసింది. 30 ఏళ్లు వచ్చిన హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీలో ఎలా చూస్తున్నారో పేర్కొంది. ఇలాంటి వాళ్ల పట్ల ధోరణి మారుతోందని చెప్పింది. జ్యూసీ క్యారెక్టర్లు వస్తున్నాయని పేర్కొంది.
అందం, డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొట్టే తమన్నా భాటియా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సెన్సేషనల్ గా మారింది. తాజాగా 30 ఏళ్ల వయస్సులో ఉన్న హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీలో మారుతున్న మనస్తత్వం గురించి ఆమె మాట్లాడింది. తెరపై వయస్సు, అనుభవాన్ని ఎలా ఎక్కువగా గౌరవిస్తున్నారో ఆమె స్పష్టం చేసింది.

తమన్నా పదేళ్ల ప్లాన్
ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రయాణం గురించి ఆలోచిస్తూ, తాను పరిశ్రమలోకి వచ్చినప్పుడు పదేళ్ల ప్లాన్ పెట్టుకున్నట్లు వెల్లడించింది. 30 ఏళ్లలోకి వచ్చిన హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీ చూసే విధానం గురించి తమన్నా మాట్లాడింది.
పిల్లలను కంటానని
"అవును, కచ్చితంగా. 30 ఏళ్లు దాటిన హీరోయిన్లను చూసి మనస్తత్వం మారింది. ఈ వయస్సు వర్గానికి చెందిన మహిళల కోసం ఇప్పుడు మరిన్ని పాత్రలు రాస్తున్నారు. గతంలో ఆ వయస్సు దాటిన తర్వాత హీరోయిన్లను అంతగా చూపించేవారు కాదు. నిజానికి నేను నటిగా మారినప్పుడు పదేళ్ల ప్లాన్ ఉండేది. ముప్పైలలోకి వచ్చే వరకు పని చేస్తా. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలను కంటానని అనుకున్నా’’ అని తమన్నా చెప్పింది.
జ్యూసీ క్యారెక్టర్లు
"కానీ మంచి విషయం ఏమిటంటే, నేను పని చేస్తున్నప్పుడు నా ఇరవైల చివర్లో ఉన్నప్పుడు, నేను నిజంగా నా సొంత వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాను. అప్పటికే, అదృష్టవశాత్తూ పరిశ్రమ శక్తివంతమైన (జ్యూసీ) పాత్రలను రాయడం ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక సాధారణ మార్పు అని నేను అనుకుంటున్నా. అయితే వయస్సుపై ఈ భయం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది వృద్ధాప్యం ఒక వ్యాధి అయినట్లు మాట్లాడుతారు. వృద్ధాప్యం చాలా అద్భుతమైనది’’ అని తమన్నా పేర్కొంది.
తమన్నా రాబోయే ప్రాజెక్ట్‌లు
తమన్నా త్వరలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’లో షాహిద్ కపూర్ సరసన కనిపించనుంది. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ చిత్రం 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కూడా నటిస్తోంది.
‘వవన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లోనూ తమన్నా నటిస్తోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పౌరాణిక/ఫోక్ థ్రిల్లర్. ఈ సినిమాను మే 2026లో విడుదల చేయాలని చూస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


