ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్- చేత బడులు చేసే బాబా, అన్న చావుపై హీరోయిన్ పగ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి హారర్ మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నికిత రాయ్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చేత బడులు చేసే దొంగ బాబాను పట్టుకునేందుకు ఓ రచయిత్రి చేసే ప్రయత్నంగా, అన్న చావుపై పగ తీర్చుకునే హీరోయిన్ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. మరి నికిత రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 13, 2026, 20:05:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త వారం వచ్చిందంటే చాలు ఓటీటీలోకి సరికొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తుంటాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉంటాయి. అయితే, ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఇటీవల కాలంలో ఈ హారర్ సినిమాలకు కామెడీ, సైకలాజికల్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ వంటి అదనపు హంగులు జోడిస్తున్న విషయం తెలిసిందే.

ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్- చేత బడులు చేసే బాబా, అన్న చావుపై హీరోయిన్ పగ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్- చేత బడులు చేసే బాబా, అన్న చావుపై హీరోయిన్ పగ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్

అలానే తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది హారర్ మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్. ఆ సినిమా పేరే నికిత రాయ్. రచయిత్రిగా పనిచేసే నికిత రాయ్ అనే యువతి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో వింత ఆకారాలు, భ్రమలు, డ్రగ్స్, మత పిచ్చి, డిటెక్టివ్‌, ఇన్వెస్టిగేషన్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.

జటాధర సినిమాతో ఎంట్రీ

ఇటీవలే హారర్ థ్రిల్లర్ జటాధర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన మూవీనే నికిత రాయ్. కుశ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షితోపాటు అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు.

కథేంటంటే?

రచయిత్రి అయిన నికిత రాయ్ (సోనాక్షి సిన్హా) సోదరుడు డాక్టర్ సనల్ రాయ్ (అర్జున్ రాంపాల్) లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. తన అన్న మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి నికిత లండన్ బయలుదేరుతుంది. నికితకు సహాయంగా మాజీ ప్రియుడు జాలీ (సుహైల్ నయ్యర్) తోడవుతాడు.

చేతబడులు చేసే బాబా

ఈ క్రమంలో తక్షణమే వ్యాధులను నయం చేస్తానని నమ్మించే అమర్ దేవ్ అనే ఒక బాబా (పరేష్ రావల్) వీరికి ఎదురవుతాడు. బాబా ముసుగులో అమర్ దేవ్ మూఢ నమ్మకాలు అడ్డు పెట్టుకుని చేతబడులు చేస్తున్నాడని తెలుసుకుంటుంది నికిత.

నికిత రాయ్ ట్విస్టులు

మరి దొంగ బాబాను సాక్ష్యాలతో నికిత పట్టుకుందా? అన్న చావుపై పగ తీర్చుకుందా? నికిత సోదరుడి మరణానికి కారణం ఎవరు? ఈ క్రమంలో నికితకు ఎదురైన భయానక సంఘటనలు ఏంటీ? నికిత ఎలాంటి నిజాలు తెలుసుకుంది? అనేదే మిగతా కథ.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే నికిత రాయ్ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 12 అంటే నిన్నటి నుంచే నికిత రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జియో హాట్‌స్టార్‌లో నికిత రాయ్ ఓటీటీ రిలీజ్ అయింది.

నికిత రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్

అయితే, నికిత రాయ్ ప్రస్తుతం కేవలం హిందీ భాషలో మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా సినిమాను చూడానుకునేవారు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో హిందీలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో నికిత రాయ్‌ను వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More