బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో కన్నీళ్లు పెట్టుకున్న హోస్ట్ సల్మాన్ ఖాన్- దిగ్గజ నటుడు ధర్మేంద్రకు నివాళి
బిగ్ బాస్ 19 విన్నర్‌గా గౌరవ్ ఖాన్ నిలిచాడు. అయితే, బిగ్ బాస్ హిందీ 19 సీజన్ గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణానికి చింతిస్తూ చాలా ముఖ్యమైన విశేషాలు చెప్పారు. అలాగే, బిగ్ బాస్ స్టేజీపై ధర్మేంద్రకు నివాళి అర్పించారు.
బాలీవుడ్‌ను ఏలిన 'హీ-మ్యాన్', దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. నవంబర్ 24న లోకాన్ని విడిచి ధర్మేంద్ర వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో ధర్మేంద్రను తలుచుకుని హోస్ట్ సల్మాన్ ఖాన్ కన్నీటిపర్యంతం అయ్యారు.

ధర్మేంద్రను గుర్తుచేసుకుంటూ
అయితే, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే రియాలిటీ షో 'బిగ్ బాస్'కు పలుమార్లు అతిథిగా ధర్మేంద్ర హాజరయ్యారు. తాజాగా జరిగిన 'బిగ్ బాస్ 19' గ్రాండ్ ఫినాలే సందర్భంగా, ధర్మేంద్రను గుర్తుచేసుకుంటూ సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు.
ముఖ్యంగా, సన్నీ డియోల్, బాబీ డియోల్ తమ తండ్రి అంత్యక్రియలను, ప్రార్థనా సమావేశాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించిన తీరును సల్మాన్ అభినందించారు.
ధర్మేంద్రకు నివాళిగా 'బిగ్ బాస్' హిందీ సెట్‌లో దిగ్గజ నటుడు గడిపిన మరపురాని క్షణాల క్లిప్‌ను ప్రదర్శించారు. ఆ వీడియో ముగిసిన తరువాత సల్మాన్ ఖాన్ కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడారు.
సల్మాన్ తీవ్ర భావోద్వేగం
“మనం హీ-మ్యాన్‌ను కోల్పోయాం. మనం అత్యద్భుతమైన వ్యక్తిని కోల్పోయాం. ధర్మేంద్రజీ కంటే గొప్ప వ్యక్తి ఇంకొకరు ఉన్నారని నేను అనుకోను” అని సల్మాన్ తీవ్ర భావోద్వేగంతో అన్నారు.
“ఆయన తన జీవితాన్ని ఒక రాజులా గడిపారు. ఆయన మనకు సన్నీ, బాబీ, ఈషాలను అందించారు. ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కేవలం పనిచేయాలనే తపనతోనే ఉన్నారు. ఎన్నో పాత్రలు పోషించారు. నా కెరీర్ గ్రాఫ్‌లో నేను ధర్మజీని మాత్రమే అనుసరించాను. అమాయకమైన ముఖం, హీ-మ్యాన్ లాంటి దేహంతో ఆయన వచ్చారు. ఆ ఆకర్షణ ఆయన చివరి వరకూ నిలిచి ఉంది. లవ్ యూ ధర్మజీ. మిమ్మల్ని ఎల్లప్పుడూ మిస్ అవుతాం” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు సల్మాన్ ఖాన్.
ధర్మేంద్రకు సోషల్ మీడియాలో అభిమానులు కురిపించినంత అపారమైన ప్రేమను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని సల్మాన్ అన్నారు. ఆ తరువాత, ఆయన మరింతగా కన్నీరు పెట్టుకుంటూ ఒక విషయం వెల్లడించారు.
నా తండ్రి పుట్టినరోజునే
“ముఖ్యంగా చెప్పాలంటే.. ఆయన (ధర్మేంద్ర) నవంబర్ 24న మరణించారు. అది సరిగ్గా నా తండ్రి పుట్టినరోజు. నవంబర్ 26 ఆయన పుట్టినరోజు. అలాగే మా అమ్మ పుట్టినరోజు కూడా. ఈ విషయం నాకే ఇంత బాధ కలిగిస్తుంటే.. సన్నీ, బాబీ, వాళ్ల కుటుంబం ఎంత వేదన అనుభవిస్తున్నారో ఊహించండి” అని సల్మాన్ ఖాన్ తెలిపారు.
ధర్మేంద్ర అంత్యక్రియలు, ప్రార్థనా సమావేశాలను నిర్వహించిన తీరుపై సల్మాన్ మాట్లాడుతూ, “సూరజ్ బర్జాత్యా గారి తల్లి అంత్యక్రియలు, ధర్మజీ అంత్యక్రియలు.. ఈ రెండూ అత్యంత గౌరవప్రదంగా జరిగాయి. వారు ఆయన ప్రార్థనా సమావేశాన్ని కూడా ఎంతో దయ, గౌరవంతో నిర్వహించారు” అని చెప్పారు.
”అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. కానీ, ఒక పద్ధతి ఉంది. అది ఒక జీవితాన్ని పండుగలా జరుపుకున్నట్లు అనిపించింది. బాబీ, సన్నీలకు హ్యాట్సాఫ్. ప్రతి అంత్యక్రియలు, ప్రార్థనా సమావేశం ఇంత అందంగా, గౌరవప్రదంగా జరగాలి” అని సల్మాన్ ఖాన్ ప్రశంసించారు.
బిగ్ బాస్ 19 విన్నర్
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 19 విన్నర్‌గా గౌరవ్ ఖాన్ నిలిచాడు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. నవంబర్ 10 నాటికి ఆయన మరణించారనే పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే, ఆయన భార్య హేమ మాలిని, కూతురు ఈషా డియోల్ ఆ పుకార్లను కొట్టిపారేసి, ఆయన కోలుకుంటున్నారని ధృవీకరించారు.
ఆ తరువాత కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకువచ్చారు. దురదృష్టవశాత్తు, నవంబర్ 24న 89 సంవత్సరాల వయసులో ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


