ధర్మేంద్ర నా తండ్రి.. అంతకు మించి ఇంకేం లేదు.. అతడు పూర్తి ఆరోగ్యంతో వస్తాడు: సల్మాన్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్

ధర్మేంద్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తన ఫిట్‌నెస్ ఇన్‌స్పిరేషన్ ఎవరు అని అడిగినప్పుడు అతడు ధర్మేంద్ర పేరు చెప్పడం విశేషం. అంతేకాదు అతడు తన తండ్రి అని అన్నాడు.

Published on: Nov 14, 2025, 17:02:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబైలోని ఆసుపత్రిలో ధర్మేంద్ర చేరిన సమయంలో, ఆయనను పరామర్శించిన తొలి వ్యక్తులలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. తాజాగా సల్మాన్ ఖాన్ సీనియర్ నటుడిపై తనకున్న అమితమైన ప్రేమను వ్యక్తం చేశాడు. ధర్మేంద్ర తనకు "తండ్రితో సమానం" అని పేర్కొన్న సల్మాన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపాడు.

ధర్మేంద్ర నా తండ్రి.. అంతకు మించి ఇంకేం లేదు.. అతడు పూర్తి ఆరోగ్యంతో వస్తాడు: సల్మాన్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్
ధర్మేంద్ర నా తండ్రి.. అంతకు మించి ఇంకేం లేదు.. అతడు పూర్తి ఆరోగ్యంతో వస్తాడు: సల్మాన్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్

సల్మాన్ ఏమన్నాడంటే?

గురువారం (నవంబర్ 13) ఖతార్‌లో జరిగిన ద-బంగ్ ది టూర్ రీలోడెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈవెంట్‌లో తన ఫిట్‌నెస్ ప్రయాణానికి ఎవరు స్ఫూర్తి అని సల్మాన్‌ను అడగగా.. అతడు వెంటనే ధర్మేంద్ర పట్ల తన అభిమానాన్ని, అనుబంధాన్ని వ్యక్తపరిచాడు.

సల్మాన్ మాట్లాడుతూ.. “నేను రాకముందు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ధరమ్ జీ అత్యంత ముఖ్యమైన వారు” అని అన్నాడు. "ఆయన నా తండ్రి, అంతే. ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను. ఆయన త్వరగా తిరిగి వస్తారని నేను ఆశిస్తున్నాను" అని కూడా సల్మాన్ అన్నాడు.

సల్మాన్ ఈ మాట అనగానే.. అభిమానులు "ధరమ్ జీ లాంగ్ లివ్" అంటూ నినాదాలు చేశారు. ధర్మేంద్ర కూడా సల్మాన్‌ను ముద్దుగా 'బేటా' అని పిలవడం, తన జీవిత చరిత్రకు సల్మాన్ సరైన వ్యక్తి అని ఒకసారి చెప్పడం ఈ ఇద్దరి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది.

ధర్మేంద్ర ఆరోగ్యం, రాబోయే సినిమాలు

బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర బుధవారం (నవంబర్ 12) నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఇంట్లోనే చికిత్స కొనసాగిస్తూ కోలుకుంటున్నారు. ప్రైవసీని గౌరవించాలని సన్నీ డియోల్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. ధర్మేంద్ర చివరగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేసిన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

ధర్మేంద్ర తదుపరి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇక్కీస్' (Ikkis) చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం 1971 యుద్ధం నేపథ్యంలో రూపొందుతోంది. ఇది డిసెంబర్ 2025లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

సల్మాన్ ఖాన్ రాబోయే ప్రాజెక్టులు

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రియాలిటీ షో ‘బిగ్ బాస్ 19’కి హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ తదుపరి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' చిత్రంలో కనిపించనున్నారు. 2020లో భారత, చైనా దళాల మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కూడా నటిస్తుస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More