సెన్సేషనల్ కాంబో రిపీట్- ఓ రోమియో టీజర్ రిలీజ్- వయోలెంట్‌గా షాహిద్ కపూర్- ఆ సీనియర్ నటి బూతు డైలాగ్‌తో ఇంటర్నెట్ షేక్!
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ హిందీ యాక్షన్ రొమాంటిక్ డ్రామా సినిమా ‘ఓ రోమియో’. తాజాగా ఇవాళ (జనవరి 10) ఓ రోమియో టీజర్‌ను రిలీజ్ చేశారు. షాహిద్ కపూర్ రగ్గడ్ లుక్, సీనియర్ నటి ఫరీదా జలాల్ చెప్పిన బోల్డ్ డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్, స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ‘కమీనే’, ‘హైదర్’ వంటి క్లాసిక్ సినిమాల తర్వాత విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ వంటి సెన్సేషనల్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఓ రోమియో’ (O’ Romeo).

తాజాగా శనివారం (జనవరి 10) నాడు ఓ రోమియో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓ రోమియో టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. 1 నిమిషం 35 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో సినిమాలోని విభిన్నమైన పాత్రలను పరిచయం చేస్తూ దర్శకుడు మ్యాజిక్ క్రియేట్ చేశారు.
షాహిద్ ఊర మాస్ లుక్.. ఫరీదా జలాల్ సర్‌ప్రైజ్
ఓ రోమియో గ్లింప్స్‌లో షాహిద్ కపూర్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తున్నారు. కౌబాయ్ హ్యాట్, బ్లాక్ వెస్ట్, ఒంటి నిండా టాటూలు, మెడలో భారీ ఆభరణాలతో పక్కా రగ్గడ్ అండ్ వయలెంట్ అవతారంలో షాహిద్ ఆకట్టుకుంటున్నారు. అయితే, ఈ టీజర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ చేసే సీనియర్ నటి ఫరీదా జలాల్ ఒక బూతు పదాన్ని వాడటం.
"ప్రేమలో ఎదిగితే రోమియో అవుతావు.. అదే ప్రేమలో మునిగిపోతే ‘చు***’ అవుతావు" అని ఫరీదా జలాల్ చెప్పే డైలాగ్ విని ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు. "సిలబస్ దాటి వచ్చిన ప్రశ్నలా ఫరీదా జలాల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు" అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
తారాగణం - సాంకేతిక నిపుణులు
ఈ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో భారీ తారాగణం నటిస్తోంది. నానా పటేకర్, విక్రాంత్ మాస్సే, అవినాష్ తివారీ, దిశా పటానీ, తమన్నా భాటియా, తృప్తి దిమ్రి వంటి స్టార్లు ఓ రోమియో గ్లింప్స్‌లో మెరిశారు. ముఖ్యంగా షాహిద్, తృప్తి దిమ్రి మధ్య వచ్చే ఒక చిన్న షాట్ వారి కెమిస్ట్రీపై అంచనాలను పెంచుతోంది. అరుణా ఇరానీ, రాహుల్ దేశ్‌పాండే కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫ్యాన్స్ రియాక్షన్: 'కమీనే' వైబ్స్ రీలోడెడ్!
విశాల్ భరద్వాజ్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే షాహిద్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ మూవీలా కనిపిస్తోందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. "ఈ గ్లింప్స్ చూస్తుంటే 'కమీనే' రోజులు గుర్తొస్తున్నాయి. 2026లో బాలీవుడ్ నుంచి రాబోతున్న ధురంధర్ 2, కింగ్, లవ్ అండ్ వార్ వంటి సినిమాలతో పాటు 'ఓ రోమియో' కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం" అని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఓ రోమియో చిత్రం ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. రోహన్ నరులాతో కలిసి విశాల్ భరద్వాజ్ ఈ కథను సిద్ధం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


