70 కోట్ల బడ్జెట్, 2 కోట్ల కలెక్షన్స్- 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బాంబ్- 6 రోజుల్లోనే ఉడాయించిన సూపర్ స్టార్ మూవీ!

2025లో భారతీయ చలనచిత్ర రంగం ‘దురంధర్’, ‘కాంతార 1’ వంటి భారీ విజయాలను చూసినప్పటికీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఓ మూవీ మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 2 కోట్లు మాత్రమే వసూలు చేసి 2025లోనే అతిపెద్ద బాక్సాఫీస్ బాంబ్‌గా నిలిచింది.

Published on: Jan 1, 2026, 20:30:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు ఒక మిశ్రమ అనుభూతిని మిగిల్చింది. ఒకవైపు 'దురంధర్', 'కాంతార చాప్టర్ 1', 'సైయారా', 'ఛావా', 'లోకా చాప్టర్ వన్' వంటి చిత్రాలు అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి.

70 కోట్ల బడ్జెట్, 2 కోట్ల కలెక్షన్స్- 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బాంబ్-  6 రోజుల్లోనే ఉడాయించిన సూపర్ స్టార్ మూవీ!
70 కోట్ల బడ్జెట్, 2 కోట్ల కలెక్షన్స్- 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బాంబ్- 6 రోజుల్లోనే ఉడాయించిన సూపర్ స్టార్ మూవీ!

కానీ, మరోవైపు అదే ఏడాది విడుదలైన చిత్రాలలో దాదాపు 80 శాతానికి పైగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందులోనూ కొన్ని చిత్రాలు ఎంత ఘోరంగా విఫలమయ్యాయంటే, ఆ పరాజయాలు కూడా సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం ‘వృషభ’.

ఇండస్ట్రీ హిట్ తర్వాత

మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా 'వృషభ' ప్రచారం పొందింది. దానికి తోడు, మోహన్ లాల్ ఇటీవల ‘ఎల్ 2: ఎంపురాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆకాశమంత అంచనాలు నెలకొన్నాయి. కానీ, క్రిస్మస్ కానుకగా విడుదలైన వృషభ బాక్సాఫీస్ వద్ద కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

తొలి రోజే వృషభ దేశవ్యాప్తంగా కేవలం రూ. 60 లక్షలు మాత్రమే వసూలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ దీనికి ఆదరణ కరువైంది. రెండో రోజు నుంచి వసూళ్లు ఇంకా పడిపోవడంతో, వారాంతం వచ్చినా పరిస్థితి మెరుగుపడలేదు.

97 శాతం నష్టం

ఆరు రోజులు ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 2 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తే కేవలం రెండు కోట్లు మాత్రమే రాబట్టగలిగింది వృషభ మూవీ. ఈ లెక్కన ఈ సినిమా ద్వారా నిర్మాతలకు దాదాపు 97 శాతం నష్టం వాటిల్లింది.

వారం కూడా గడవకముందే

సూపర్ స్టార్ మోహన్ లాల్ మ్యాజిక్ కూడా వృషభ సినిమాను కాపాడలేకపోయింది. కేరళలోని థియేటర్ యాజమాన్యాలు భారీ నష్టాలను తగ్గించుకోవడానికి మంగళవారానికే (డిసెంబర్ 30, 2025) ఈ సినిమాను స్క్రీన్ల నుంచి తొలగించాయి. అంటే, ఒక పెద్ద సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లలో నిలవలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

థియేటర్లలో విడుదలై ఆరు రోజుల్లోనే ఉడాయించిన వృషభ సినిమాకు నందకిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేశారు. మధ్యయుగ కాలానికి చెందిన రాజుగా, నేటి కాలపు వ్యాపారవేత్తగా రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపించారు.

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బాంబ్

ఈ చిత్రంలో షనిల్ లంకేశ్, నయన్ సారిక, రాగిణి ద్వివేది, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రలు పోషించారు. కాగా, వృషభ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైనప్పటికీ ఎక్కడా ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గెలవలేకపోయింది. దీంతో సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా, 2025లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బాంబ్‌గా వృషభ నిలిచింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More