మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ, దానికంటే పెద్ద దెయ్యం లేదు.. డైరెక్టర్ కరుణ కుమార్ కామెంట్స్

టాలీవుడ్ వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. ఫిబ్రవరి 6న విడుదల కానున్న హనీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Feb 5, 2026, 14:18:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి వాద్య ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన ఈ సినిమాకు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఒవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించగా.. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.

మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ, దానికంటే పెద్ద దెయ్యం లేదు.. డైరెక్టర్ కరుణ కుమార్ కామెంట్స్
మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ, దానికంటే పెద్ద దెయ్యం లేదు.. డైరెక్టర్ కరుణ కుమార్ కామెంట్స్

సైకలాజికల్ డెప్త్, హారర్ అంశాలు

సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల హనీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. నా ప్రతి ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈసారి కూడా ఒక కొత్త ప్రయత్నం చేశాను. సాహిత్యం కోసం చీకటి అనే కథ రాశాను. దాన్ని సినిమా తీద్దామని మా నిర్మాతలు వచ్చారు" అని అన్నారు.

పిల్లి మాయఅనే వస్తువు

"మదనపల్లి, పాతబస్తీ, ఒకే ఇంట్లో కొందరు ఉరి వేసుకోవడం ఇలాంటి ఘటనలు చూస్తుంటాం. హనీ సినిమాలో పిల్లి మాయ అనే ఒక వస్తువుని శోధించి సాధించే ఒక వ్యక్తి జీవితం చూపించాం. మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ. నిజ జీవిత సంఘటన నుంచి స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం లేదనేది ఈ సినిమా సారాంశం" అని కరుణ కుమార్ తెలిపారు.

"ఇదొక ఫ్యామిలీ స్టోరీ. కొత్త కథలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నవీన్ చంద్ర గారు ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో ఎప్పుడు చూడని నవీన్ చంద్ర గారిని చూడబోతున్నారు. అలాగే రాజా రవీందర్ గారి పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే దివి, దివ్య అందరు కూడా ఒకరికి మించి ఒకరు చేశారు" అని పేర్కొన్నారు కరుణ కుమార్.

ఇండియన్ సినిమాలో రాలేదు

"మా టెక్నికల్ టీం కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి కాన్సెప్టు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో రాలేదు. అది సైకలాజికల్ హారర్. ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ. సినిమా ఒకరి జీవితాన్ని మార్చలేదు, అలాగే సందేశాన్ని కూడా ఇవ్వలేదు. కానీ, ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని టార్చి వేసి చూపించగలదు. నేను కూడా అదే చేశానని నమ్ముతున్నాను" అని కరుణ కుమార్ చెప్పారు.

"మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. మా నిర్మాతలు ఈ సినిమాకి ఎంత కావాలో అంత బడ్జెట్ పెట్టడం జరిగింది. చాలా మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీతో చేశాం. ఈ సినిమాకి ప్రేక్షకులు ఊపిరి పోయాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ కరుణ కుమార్ కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More