అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మాత్రం మామిడి కాయలు ఇస్తారు.. సీనియర్ నటుడిపై బిగ్ బాస్ దివి వాద్య కామెంట్స్

బిగ్ బాస్ దివి వాద్య, నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. తాజాగా హనీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడిపై దివి వాద్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Feb 2, 2026, 15:04:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు అందం దివి వాద్యా. బిగ్ బాస్ అనంతరం వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది దివి వాద్య. తాజాగా బిగ్ బాస్ దివి కీలక పాత్ర పోషించిన తెలుగు హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ హనీ.

అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మాత్రం మామిడి కాయలు ఇస్తారు.. సీనియర్ నటుడిపై బిగ్ బాస్ దివి వాద్య కామెంట్స్
అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మాత్రం మామిడి కాయలు ఇస్తారు.. సీనియర్ నటుడిపై బిగ్ బాస్ దివి వాద్య కామెంట్స్

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హనీ సినిమాలో దివితోపాటు సీనియర్ నటుడు రాజా రవీంద్ర కూడా కీలక పాత్ర పోషించారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన హనీ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజా రవీంద్రపై బిగ్ బాస్ దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీంతో బిగ్ బాస్ దివి వాద్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అప్పుడు కుదరలేదు

మొదటగా హీరోయిన్ దివి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. కరుణ కుమార్ గారితో పని చేయాలని నాకు ఎప్పటినుంచో ఉండేది. పలాస సినిమా సమయంలో కలిశాను. కానీ, కుదరలేదు. ఆయన నుంచి కాల్ వచ్చిన వెంటనే వెళ్లాను. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటెడ్‌గా ఫీలయ్యాను" అని అన్నారు.

"ఇందులో నవీన్ గారు, దివ్య, రాజా రవీంద్ర గారు ఇలా అందరూ ఒకరికి మించి ఒకరు పర్ఫామెన్స్ ఇచ్చే నటుల మధ్య నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీ అందరిని వెంటాడే సినిమా అవుతుంది. అందరూ ఫిబ్రవరి 6న థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను" అని బిగ్ బాస్ దివి తెలిపింది.

డార్క్ సైడ్ ఎక్స్‌ప్లోర్ అయినట్లు

దివి వాద్య స్పీచ్ తర్వాత హనీ మూవీలో క్యారెక్టర్ గురించి మీడియా పర్సన్ ప్రశ్నించారు. "మీ క్యారెక్టర్ డార్క్ సైడ్ ఉంటుందా. ట్రైలర్‌లో చూస్తున్నంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్‌ప్లోర్ అయినట్లు అనిపిస్తుంది" అని జర్నలిస్ట్ అడిగారు. దానికి సింపుల్‌గా దివి "అవునండి" అని అనేసింది.

అది విన్న వెంటనే పక్కనే ఉన్న సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర "ఏయ్.." అని వారిస్తూ అరిచాడు. "చెప్పొద్దా" అని దివి అంది. రాజా రవీంద్ర సైలెంట్‌గా ఉన్నాడు. "చెప్పండి కదా.. ఏంటండి.. ఇలా అందరిముందు బెదిరిస్తారు.. ఎవరు లేనప్పుడు మామిడి కాయలు ఇస్తారు" అని దివి వాద్య అంది.

రాజా రవీంద్ర వివరణ

దాంతో అక్కడున్న వాళ్లంతా ఒకేసారి నవ్వేశారు. దివి మాత్రం సిగ్గుతో తల దించుకుంది. "షూటింగ్ సమ్మర్‌లో జరిగింది" అని రాజా రవీంద్ర వివరణ ఇచ్చాడు. "ఎవరిచ్చారు సర్ మామిడి కాయలు" అని రిపోర్టర్ అడిగారు. "సెట్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది. అదే నేను చెప్పాను, ఓకే" అని దివి వాద్య తెలిపింది.

ఇక జర్నలిస్ట్ మొదట అడిగిన ప్రశ్నకు.. "అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. ఈ సినిమా నుంచి డార్క్, ఇలాంటి నెగెటివ్ రోల్స్ ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నాను. కరుణ కుమార్ గారు చాలా బాగా చేయించారు. నేనేనా ఇదంతా చేశాను అనిపించింది" అని బిగ్ బాస్ దివి వాద్య చెప్పుకొచ్చింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More