భయపెట్టేలా హారర్ థ్రిల్లర్ మూవీ హనీ ట్రైలర్- డార్క్ సొసైటీని చూపించామన్న హీరో నవీన్ చంద్ర- దురుసుగా ప్రవర్తించానంటూ!

టాలీవుడ్ వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలు పోషించిన హనీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టంగ్ విషయాలు పంచుకున్నారు.

Published on: Feb 2, 2026, 11:14:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. ఒవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.

భయపెట్టేలా హారర్ థ్రిల్లర్ మూవీ హనీ ట్రైలర్- డార్క్ సొసైటీని చూపించామన్న హీరో నవీన్ చంద్ర- దురుసుగా ప్రవర్తించానంటూ!
భయపెట్టేలా హారర్ థ్రిల్లర్ మూవీ హనీ ట్రైలర్- డార్క్ సొసైటీని చూపించామన్న హీరో నవీన్ చంద్ర- దురుసుగా ప్రవర్తించానంటూ!

హారర్ సీన్స్‌తో భయపెట్టేలా

సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా హనీ ట్రైలర్ రిలీజ్ చేశారు. హారర్ సీన్స్‌తో భయపెట్టేలా హనీ ట్రైలర్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా హనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

హీరో నవీన్ చంద్ర కామెంట్స్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. హనీ ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మౌత్ టాక్‌తో నిలబడే సినిమా. మాకు ఉన్న బడ్జెట్‌లో థియేటర్స్‌కి తీసుకొచ్చి ఆడియెన్స్‌కి ‌ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను" అని అన్నారు.

దివి అద్భుతమైన నటి

"ఫిబ్రవరి 6న దయచేసి ఒకసారి థియేటర్‌కి రండి. ఇది థియేటర్‌కి చాలా బాగుంటుంది. దివి చాలా అద్భుతమైన నటి. తను తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది. దివ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఆలోచన రేకెత్తించే సినిమా. డివోపి మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఇందులో ఉన్న పాప కూడా చాలా చక్కగా నటించింది" అని నవీన్ చంద్ర తెలిపారు.

డార్క్ సొసైటీని చూపించాం

"మట్కా సినిమా సమయంలో కరుణ కుమార్ గారితో చాలా దగ్గర అయ్యాను. ఈ కథకు ఆయన నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఈ సమాజంలో ఆశ కోసం ప్రజలు ఏవేవో చేస్తున్నారు. ఇందులో ఒక డార్క్ సొసైటీని చూపించాము" అని నవీన్ చంద్ర పేర్కొన్నారు.

జాగ్రత్తగా ఉన్నాను

"ఈ కథ విన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం విక్టిమ్ అవుతాం. ఆనంద్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి కథలు మరిన్ని వస్తాయి" అని నవీన్ చంద్ర చెప్పారు.

దురుసుగా ప్రవర్తించాను

"ఈ సినిమా చేసిన్నప్పుడు చాలా మ్యాడ్ నెస్‌లో ఉన్నాను. చాలా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ సినిమా షూటింగ్‌లో ఒక సంఘటన జరిగింది. ఈ క్యారెక్టర్ ప్రభావం వల్ల ఒక వ్యక్తితో నేను దురుసుగా ప్రవర్తించాను. అయితే అది నేను కాదు. ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది. తప్పకుండా ఫిబ్రవరి 6న ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను" అని నవీన్ చంద్ర వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More