ఒకేసారి ఐదుగురితో రొమాంటిక్ చాటింగ్- విదేశంలో ప్రియుడి గుట్టు రట్టు చేసిన షనయ కపూర్- లైగర్ హీరోయిన్ సలహాతో అలా!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ షనయ కపూర్ తన పాత ప్రేమాయణంలోని చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. విదేశాల్లో సరదాగా గడుపుతున్న సమయంలో తన ప్రియుడు ఐదుగురు అమ్మాయిలతో సీక్రెట్‌గా మెసేజ్‌లు చేస్తూ దొరికిపోయాడని, ఆ మోసం తనను ఎంతగా కలచివేసిందో ‘రిలేషన్‌షిట్ అడ్వైస్’ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.

Published on: Feb 13, 2026, 11:50:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనయ కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రేమ, నమ్మకం, వెన్నుపోటు వంటి అంశాలపై స్పందిస్తూ.. తన మాజీ ప్రియుడు చేసిన మోసాన్ని తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించారు బ్యూటిపుల్ హీరోయిన్ షనయ కపూర్.

ఒకేసారి ఐదుగురితో రొమాంటిక్ చాటింగ్- విదేశంలో ప్రియుడి గుట్టు రట్టు చేసిన షనయ కపూర్- లైగర్ హీరోయిన్ సలహాతో అలా! (Photo: Instagram)
ఒకేసారి ఐదుగురితో రొమాంటిక్ చాటింగ్- విదేశంలో ప్రియుడి గుట్టు రట్టు చేసిన షనయ కపూర్- లైగర్ హీరోయిన్ సలహాతో అలా! (Photo: Instagram)

పర్‌ఫెక్ట్ అనుకున్న బంధంలో ఊహించని మలుపు

అది షనాయా కపూర్ కెరీర్ ఆరంభంలో జరిగిన సంఘటన. తన ప్రియుడితో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. "మా మధ్య బంధం చాలా అద్భుతంగా సాగుతోందని, నా జీవితంలో దొరికిన బెస్ట్ పార్ట్‌నర్ ఇతడే అని నేను గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని" అని షనయ కపూర్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కానీ, ఆ ప్రయాణమే ఆమె కళ్లు తెరిపించిందని చెప్పుకొచ్చారు.

క్యాబ్ బుక్ చేయబోతే కన్పించిన అసలు రంగు

ఒకరోజు రాత్రి డిన్నర్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, షనయ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయింది. దీంతో క్యాబ్ బుక్ చేయడం కోసం తన ప్రియుడి ఫోన్ తీసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అతడి మాజీ ప్రేయసి నుంచి ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది.

అనుమానంతో చాట్ ఓపెన్ చేసిన షనయకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. కేవలం మాజీ ప్రేయసి మాత్రమే కాదు.. మరో నలుగురు అమ్మాయిలతో అతను రొమాంటిక్ చాటింగ్ చేస్తున్నట్లు షనయ గుర్తించారు. "ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు అమ్మాయిలతో అతను సింగిల్‌గా ఉన్నట్లు నటిస్తూ మెసేజ్‌లు చేస్తున్నాడు" అని షనయ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనన్య పాండే సలహా.. మూడు రోజుల నటన

వెంటనే ఆ చాట్‌లను స్క్రీన్ షాట్లు తీసి తన సన్నిహితులకు పంపారు షనయ. అందులో తన ప్రాణ స్నేహితురాలు, లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఉన్నారు. "వెంటనే అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి నా దగ్గరికి వచ్చేయ్" అని అనన్య పాండే సలహా ఇచ్చినా, విదేశీ గడ్డపై ఒంటరిగా అలా రావడం సాధ్యం కాలేదని షనయ చెప్పారు. దీంతో తనకేమీ తెలియనట్లుగా మరో మూడు రోజుల పాటు అతనితోనే ఉంటూ మామూలుగా నటించాల్సి వచ్చిందని షనయ తెలిపారు.

చివరికి ప్రియుడికి అనుమానం వచ్చి ఒక ఖరీదైన ఇయర్ రింగ్స్ (చెవి పోగులు) కొనిచ్చి షనయను ప్రసన్నం చేసుకోవాలని చూశాడు. "అవన్నీ చూసి నేను నవ్వుకున్నాను. వాటిని 'గిల్టీ ఇయర్ రింగ్స్' అని పిలుస్తూనే, ఆ తర్వాత అతడికి గుడ్ బై చెప్పేశాను. ఇప్పటికీ ఆ పోగులు నా దగ్గరే ఉన్నాయి.. ఆ బాధను అనుభవించినందుకు అవి నాకు దక్కిన బహుమతి అనుకుంటాను" అని షనయ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

షనయ సినిమా విశేషాలు

ప్రస్తుతం షనయ కపూర్ తన లేటెస్ట్ మూవీ ‘తూ యా మైన్’ (Tu Yaa Main) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో ఆదర్శ్ గౌరవ్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 13) విడుదలైంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More