వారణాసి కోసం రాజమౌళి బిగ్ ప్లాన్స్.. ఓటీటీ రైట్స్ ఇలా.. రెమ్యునరేషన్ లో భాగంగా ఓవర్సీస్ హక్కులు
అప్ కమింగ్ తెలుగు సినిమాల్లో భారీ అంచనాలున్న చిత్రాల్లో వారణాసి ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఇది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ, ఓవర్సీస్ రైట్స్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘వారణాసి’. ఇది టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో వారణాసి ఓటీటీ, ఓవర్సీస్ రైట్స్ డీల్స్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.

వారణాసి ఓటీటీ
వారణాసి మూవీని రికార్డు ఓటీటీ రేటుకు అమ్మేందుకు రాజమౌళి అండ్ ప్రొడ్యూసర్ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఓటీటీ హక్కుల నుంచే రూ.600 కోట్లు రాబట్టాలని చూస్తున్నారని టాక్. ఇండియన్ మూవీకి ఇది రికార్డు రేట్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా అల్లు అర్జున్- అట్లీ మూవీ ఓటీటీకి రూ.600 కోట్ల ధర పలికిందనే వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెషనల్ ప్రమోషన్స్
వారణాసిని వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కు దగ్గర చేసేందుకు రాజమౌళి పెద్ద ప్లాన్లే వేశారు. ముందు నుంచే హాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. డైరెక్టర్ రాజమౌళితో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రీసెంట్ గా ఇవి రిలీజ్ అయ్యాయి. దీంతో గ్లోబల్ వైడ్ గా వారణాసి మూవీకి రీచ్ తీసుకొచ్చి, ఓటీటీ రైట్స్ కోసం ఎక్కువ రేట్ డిమాండ్ చేయాలన్నది సినిమా టీమ్ ఆలోచన అనే కామెంట్లు వస్తున్నాయి.
ఓవర్సీస్ రైట్స్
వారణాసి సినిమాను రూ.1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో డైరెక్టర్, ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటులకే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. ఇక రెమ్యునరేషన్ లో భాగంగా వారణాసి మూవీ ఓవర్సీస్ రైట్స్ ను కూడా రాజమౌళి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే విదేశాల్లో వారణాసి సినిమా అమ్మితే వచ్చే డబ్బులు రాజమౌళి అకౌంట్లోకి చేరనున్నాయని చెప్పొచ్చు.
సుమారు రూ.160 కోట్ల విలువైన వారణాసి ఓవర్సీస్ రైట్స్ ను రాజమౌళి తీసుకున్నారన్నది లేటెస్ట్ బజ్. మరోవైపు మహేష్ బాబు కూడా తన రెమ్యునరేషన్ కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్ లో పార్ట్ నర్ గా ఉన్నాడని తెలిసింది. దీంతో రూ.200 కోట్ల వరకు మహేష్ కు వస్తాయని టాక్.
వారణాసి గురించి
ఎస్ఎస్ రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ వారణాసి. ఇందులో రుద్రగా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు మహేష్. అంతే కాకుండా రాముడి గెటప్ లోనూ కనిపించనున్నాడు. మందాకినిగా హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

E-Paper












