రాజాసాబ్ రచ్చ మమూలూగా లేదు.. ఇలా ఓటీటీ రిలీజ్.. అలా ట్రెండింగ్.. ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేస్తున్న ఫ్యాన్స్
ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ రచ్చ మామూలుగా లేదు. ఇలా ఓటీటీలోకి రిలీజైందో లేదో అలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ మూవీ. ఈ రోజే డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టింది రాజాసాబ్.
ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఇవాళ (ఫిబ్రవరి 6) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన రాజాసాబ్ ఓటీటీని షేక్ చేస్తోంది.

రాజాసాబ్ ఓటీటీ
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రాజాసాబ్ మూవీ ఓటీటీ లవర్స్ కు అందుబాటులో ఉంది. ఈ సినిమాకు అదనపు సీన్లు యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ లో
రాజాసాబ్ మూవీ ఇలా ఓటీటీలోకి వచ్చిందో లేదో అలా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. అర్ధరాత్రి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచే ఫ్యాన్స్ ఈ మూవీని ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీ జియోహాట్‌స్టార్ లో తెలుగు ట్రెండింగ్ లో ఇండియాలో సెకండ్ ప్లేస్ కు వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్ లో మలయాళం హారర్ థ్రిల్లర్ సర్వం మాయ ఉంది.
థియేటర్ రెస్పాన్స్
సంక్రాంతి 2026 సందర్భంగా రాజాసాబ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. జనవరి 9న ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ స్క్రీన్ల మీదకు వచ్చేసింది. భారీ అంచనాల నేపథ్యంలో మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు ఖాతాలో చేరాయి. కానీ ఆ తర్వాత మిక్స్ డ్ టాక్ కారణంగా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. చివరకు రూ.200 కోట్లు దాటిన తర్వాత ఆగిపోయాయి. సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల ప్రకారం చూస్తే రాజాసాబ్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.
రాజాసాబ్ స్టోరీ
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు. తన నానమ్మ కోసం తాతయ్యను వెతికి తీసుకొద్దామని హీరో అనుకుంటాడు. కానీ తాత ట్రాప్ లో పడి ఓ రాజ మహల్ కు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక హీరోకు చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
రాజ్ మహల్ లోని పరిస్థితులు హీరోను భయపెడతాయి. ప్రాణాలను ప్రమాదంలోకి నెడతాయి. మరి హీరోకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అతని గతం ఏంటీ? నానమ్మ కోరిక ఏంటీ? అన్నది రాజాసాబ్ మూవీలో చూడాల్సందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












