OTT: ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు- రాజాసాబ్ నుంచి నారీ నారీ నడుమ మురారి వరకు- ఏ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? నాలుగు కన్ఫామ్
ఈ ఏడాది సంక్రాంతికి సినిమా సందడి ఓ రేంజ్ లో కనిపించింది. ది రాజాసాబ్ నుంచి నారీ నారీ నడుమ మురారి వరకు అయిదు తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటితో పాటు పరాశక్తి, వా వాతియార్ అనే తమిళ సినిమాలూ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే నాలుగు సినిమాల ఓటీటీ రిలీజ్ కన్ఫామైంది.
ఓటీటీ లవర్స్ కు పండగే. థియేటర్లలో సంక్రాంతి 2026కు పర్ఫెక్ట్ మూవీ పండగ అందించిన తెలుగు, తమిళ సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ది రాజాసాబ్ నుంచి నారీ నారీ నడుమ మురారి వరకు ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళం కలిపి 7 సినిమాలు వచ్చాయి. ఇవి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సై అంటున్నాయి.

సంక్రాంతి 2026 సినిమాలు
2026 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించింది. ఈ పండగ సందర్భంగా జనవరి 9న ది రాజాసాబ్, జనవరి 10న పరాశక్తి (తమిళం), జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి, జనవరి 14న అనగనగా ఒక రాజు, వా వాతియార్ (తమిళం), నారీ నారీ నడుమ మురారి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.
అన్నగారు వస్తారు
సంక్రాంతి 2026 సినిమాల్లో ఇప్పటికే ఓ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కార్తి హీరోగా నటించిన తమిళ మూవీ వా వాతియార్. ఇది తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో అమెజాన్ ప్రైమ్ ఇండియాలో ప్లే అవుతుంది. ఈ సినిమా జనవరి 28 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంది.
ది రాజాసాబ్ ఓటీటీ
శర్వానంద్ హీరోగా నటించిన ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ కామెడీ మూవీ నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ది రాజాసాబ్ మూవీ కూడా ఫిబ్రవరిలో ఓటీటీలోకి రానుంది. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఫిబ్రవరి 6న జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. మరో తమిళ సినిమా పరాశక్తి ఏమో ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మన శంకర వరప్రసాద్ గారు
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఇంకా మూడు.. మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణప్తి, అనగనగా ఒక రాజు ఓటీటీ రిలీజ్ లపై అఫీషియల్ అనౌన్స్ మెంట్లు రాలేవు. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఫిబ్రవరి 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
రవితేజ మూవీ
భార్య, ప్రియురాలు మధ్య నలిగిపోయే భర్తగా రవితేజ నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ణప్తి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను జీ5 దక్కించుకుంది. ఇది ఫిబ్రవరి రెండో వారంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. ఇక నవీన్ పొలిశెట్టి ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ అనగనగా ఒక రాజు సినిమా ఏమో ఫిబ్రవరి మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్ లోకి రానుందనే టాక్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


