నారీ నారీ నడుమ మురారి హిట్.. బాలకృష్ణ రియాక్షన్ ఇదే .. పరువు నిలబెట్టావ్.. శర్వా ఇంట్రెస్టింగ్ కామెంట్లు
నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి 2026కు హిట్ కొట్టాడు శర్వా. ఇది నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ టైటిల్. మరి ఇప్పుడు శర్వా సినిమా హిట్ తర్వాత బాలకృష్ణ ఏమన్నారో తాజాగా బయటపడింది. శర్వానంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతూ మరోసారి హిట్ కొట్టేశాడు శర్వానంద్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 14న రిలీజైంది ఈ సినిమా. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ టైటిల్ తో నందమూరి బాలకృష్ణ గతంలో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమాపై బాలకృష్ణ రియాక్షన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

నారీ నారీ నడుమ మురారిపై బాలకృష్ణ
నారీ నారీ నడుమ మురారి సినిమాలో శర్వానంద్ హీరో. అయితే గతంలో ఇదే టైటిల్ తో బాలకృష్ణ సినిమా తీసి హిట్ కొట్టారు. ఇప్పుడీ టైటిల్ ను శర్వానంద్ వాడుకున్నాడు. ఇప్పుడు కూడా మూవీ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తన పరువు నిలబెట్టావని బాలకృష్ణ తనతో అన్నారని శర్వానంద్ వెల్లడించాడు.
ముహూర్తం కూడా
నారీ నారీ నడుమ మురారి మూవీ హిట్ తో తన పరువు నిలబెట్టావని బాలకృష్ణ అన్నారని శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించాడు.
‘‘నారీ నారీ నడుమ మురారి టైటిల్ అనుకున్నాం. సూపర్ గా ఉంది. మరి ఒకసారి బాలయ్య బాబును అడుగుదామని అన్నా. నేను కాల్ చేశా. బాబు ఇలా పెట్టుకుందామని అనుకుంటున్నా ఇలా అని అడిగా. ‘హేయ్.. నువ్వు అడగటం ఎందుకు? నువ్వు నావాడివి. నువ్వు శుభ్రంగా పెట్టుకో’ అని అన్నారు. అంతే కాదు ముహూర్తం కూడా ఆయనే పెట్టారు’’ అని శర్వానంద్ తెలిపాడు.
పరువు నిలబెట్టావని
‘‘అన్ స్టాపబుల్ షోలో టైటిల్ లాంఛ్ చేశారు. అదంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేనే వేరే పని మీద కాల్ చేశా. థ్యాంక్యూ యూ సర్ అని చెప్పా. ‘హేయ్.. విన్నా. నా పరువు నిలబెట్టావ్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి’ అని అన్నారు’’ అని శర్వానంద్ వెల్లడించాడు.
ఇద్దరు భామలు
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ 1990లో రిలీజైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన శోభన, జూహీ చావ్లా హీరోయిన్లు. తన బావ కూతుర్లయిన వీళ్లిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బాలకృష్ణ అనుకుంటాడు. కానీ ఇద్దరూ బాలయ్యనే కావాలంటారు. ఈ మూవీకి ఎ.కోదండరామిరెడ్డి డైరెక్టర్. కె.మురారి నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


