మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం-శ్రీను వైట్లతో మూవీని అనౌన్స్ చేసేసిన శర్వానంద్-నారీ నారీ నడుమ మురారి హిట్ జోష్

నారీ నారీ నడుమ మురారి సినిమాతో జోష్ మీదున్నాడు హీరో శర్వానంద్. ఈ ఊపులోనే వచ్చే సంక్రాంతికి కూడా మళ్లీ వస్తున్నామంటూ శ్రీను వైట్లతో సినిమాను అనౌన్స్ చేసేశాడు. 

Published on: Jan 17, 2026, 14:52:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి జోష్ లో ఉన్నాడు హీరో శర్వానంద్. చాలా కాలం తర్వాత శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కింది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ ఉత్సాహంలోనే వచ్చే సంక్రాంతికి కూడా వస్తున్నామని శ్రీను వైట్లతో మూవీని అనౌన్స్ చేసేశాడు శర్వానంద్.

శర్వానంద్ (x)
శర్వానంద్ (x)

శర్వానంద్ శ్రీను వైట్ల మూవీ

నారీ నారీ నడుమ మురారి మూవీ సక్సెస్ తో శర్వానంద్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో శర్వా స్పీచ్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. సంక్రాంతిని తన సినిమా వస్తే తన మూవీతో పాటు రిలీజైన అన్ని చిత్రాలు హిట్ అవుతాయని శర్వానంద్ ఈ సందర్భంగా తెలిపాడు. అలాగే 2027 సంక్రాంతికి మరో సినిమాతో వస్తున్నామన్నాడు. శ్రీను వైట్ల డైరెక్టర్ అని ప్రకటించాడు.

2027 సంక్రాంతి

‘‘శర్వా వస్తే చూడండి ప్రతి సినిమా ఆడుతుంది. అప్పుడు ఎక్స్ ప్రెస్ (ఎక్స్ ప్రెస్ రాజా) అప్పుడు నాలుగు సినిమాలు ఆడాయి. శతమానం భవతి వచ్చినప్పుడు అన్నీ ఆడాయి. నేను ఇప్పుడు వచ్చా మళ్లీ అన్ని సినిమాలూ ఆడుతున్నాయి. సో కంపల్సరీ శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి’’ అని శర్వానంద్ తెలిపాడు.

‘‘అందుకే నా కోసం ఒక స్లాట్ పక్కనపెట్టండి. ఈ సందర్భంగా.. అనౌన్స్ చేసేస్తున్నా. నెక్ట్స్ సంక్రాంతికి మళ్లీ వస్తున్నా. ఆ కాంబినేషన్ కూడా ఇక్కడే ఉంది. శ్రీను వైట్ల, మైత్రీ మూవీస్. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం. మళ్లీ కొడుతున్నాం. అన్ని సినిమాలు కొడుతున్నాం’’ అని శర్వానంద్ ప్రకటించాడు.

సంక్రాంతి హీరో

శర్వానంద్ కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. ఈ సారి నారీ నారీ నడుమ మురారి మూవీతో సంక్రాంతి హ్యాట్రిక్ సాధించాడు శర్వానంద్. 2016లో ఎక్స్ ప్రెస్ రాజా మూవీతో ఫస్ట్ సంక్రాంతి హిట్ అందుకున్నాడు శర్వా.

2017లో శతమానం భవతితో మరో సంక్రాంతి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు 2026లో నారీ నారీ నడుమ మురారితో హ్యాట్రిక్ కొట్టాడు. ఇదే జోష్ లో 2027 సంక్రాంతికి కూడా వస్తున్నానని చెప్పేశాడు.

శ్రీను వైట్లకు జాక్ పాట్

ఒకప్పుడు కామెడీ ఎంటర్ టైనర్స్ తో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీను వైట్లకు ఇటీవల హిట్ దక్కడం లేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ, విశ్వం.. ఇలా వరుసగా ఫ్లాప్ లే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం శ్రీను ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శర్వానంద్ తో తీసే మూవీ హిట్ అయితే శ్రీనుకు జాక్ పాట్ తగిలినట్లే. సంక్రాంతి సెంటిమెంట్ ఎలాగో శర్వాకు కలిసొస్తుందని తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More