ఇండియాలోనే 200 కోట్లు దాటిన మన శంకర వరప్రసాద్ గారు-చిరంజీవి పాడిన పెద్దిరెడ్డి సర్ ప్రైజ్ సాంగ్ రిలీజ్

మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. చిరంజీవి తన యాక్టింగ్, డ్యాన్స్, యాక్షన్, కామెడీ టైమింగ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఈ మూవీ ఇండియాలోనే రూ.200 కోట్ల నెట్ కలెక్షన్లు దాటింది. ఈ మూవీ నుంచి పెద్దిరెడ్డి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Published on: Jan 30, 2026, 06:17:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి లెటేస్ట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ఈ సూపర్ హిట్ మూవీ ఇండియాలోనే రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి చిరంజీవి పాడిన పెద్దిరెడ్డి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి (x/Shine_Screens)
మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి (x/Shine_Screens)

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

సంక్రాంతి 2026 విన్నర్ అయిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ, కలెక్షన్లలో దూకుడు కొనసాగిస్తోంది. జనవరి 12, 2026న రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలోనే రూ.200.69 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

మొత్తం వసూళ్లు

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రపంచవ్యాప్తంగానూ అదరగొడుతోంది. ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లోనూ మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు 4.5 మిలియన్ డాలర్లు దాటాయని కూడా ఈ సినిమా నిర్మాతలు అనౌన్స్ చేశారు.

పెద్దిరెడ్డి సాంగ్

మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూడటానికి వెళ్లిన వాళ్లకు పెద్దిరెడ్డి సాంగ్ తో చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి సర్ ప్రైజ్ చేశారు. మామను టీజ్ చేసేలా సాగే ఈ పాటను స్వయంగా చిరంజీవి పాడటం విశేషం. తాజాగా ఈ పెద్దిరెడ్డి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

మన శంకర వరప్రసాద్ గారు గురించి

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సూపర్ హిట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన రీజినల్ సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచిందని నిర్మాతలు ప్రకటించేశారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ తదితరులు నటించారు. దీనికి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తారు. కేంద్రమంత్రి రక్షణ బాధ్యతలు చూసుకుంటారు. తనకు దూరమైన భార్య, పిల్లలను తిరిగి కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More