నా నెక్ట్స్ మూవీ టైటిల్ వింటే వీడు మళ్లీ మొదలుపెట్టాడురా అని తిట్టుకోవడం ఖాయం.. క్రేజీగా ఉంటుంది: అనిల్ రావిపూడి

డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ టైటిల్, కాన్సెప్ట్ రెడీగా ఉన్నాయని చెప్పాడు. అంతేకాదు ఈ టైటిల్ వింటే తిట్టుకుంటారని కూడా అనడం విశేషం. వచ్చే సంక్రాంతికి మరోసారి అతడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Published on: Jan 22, 2026, 16:39:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అనిల్ రావిపూడి తన సినిమాలతోనే కాదు తన కామెంట్స్, తన సినిమాలకు ప్రమోషన్లతోనూ ప్రేక్షకులను నవ్విస్తాడు. తన నెక్ట్స్ సినిమా గురించి చెబుతూ అతడు అలాంటి కామెంట్సే చేశాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన అనిల్.. తన పదో సినిమా టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందంటూ హింట్ ఇచ్చాడు.

నా నెక్ట్స్ మూవీ టైటిల్ వింటే వీడు మళ్లీ మొదలుపెట్టాడురా అని తిట్టుకోవడం ఖాయం.. క్రేజీగా ఉంటుంది: అనిల్ రావిపూడి
నా నెక్ట్స్ మూవీ టైటిల్ వింటే వీడు మళ్లీ మొదలుపెట్టాడురా అని తిట్టుకోవడం ఖాయం.. క్రేజీగా ఉంటుంది: అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి పదో సినిమా

టాలీవుడ్ లో అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పట్టిందల్లా బంగారమే. హిట్ మెషీన్ గా, అందులోనూ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ల మాస్టర్ గా పేరుగాంచాడు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“నా పదో సినిమా టైటిల్ ఫిక్స్ అయిపోయా.. చాలా విచిత్రమైన టైటిల్ అది.. హీరో ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి వీడు మళ్లీ మొదలుపెట్టాడురా బాబు అని అందరూ తిట్టుకోవడం ఖాయం. సంక్రాంతి 2027కు వస్తున్నాం” అని అనిల్ రావిపూడి అనడం విశేషం.

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్

అనిల్ రావిపూడి గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఓ బ్లాక్‌బస్టర్ అందుకోగా.. ఈసారి మన శంకరవరప్రసాద్ గారుతో అంతకంటే పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది.

సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ మూవీ 10 రోజుల్లో ఇండియాలో రూ.175.65 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో ఇదే అత్యధికం.

మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్ల నుండి రూ.9.35 కోట్లు సంపాదించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.32.25 కోట్లు, రెండవ రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు, అయిదో రోజు రూ.19.5 కోట్లు సంపాదించింది. 6వ రోజు రూ.18.9 కోట్లు, 7వ రోజు రూ.17.65 కోట్లు, 8 వ రోజు రూ.8 కోట్లు, 9వ రోజు రూ.5.75 కోట్లు ఖాతాలో వేసుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More