మన శంకరవరప్రసాద్ గారు ఆల్ టైమ్ రికార్డు.. తొలి వారం బాక్సాఫీస్ వసూళ్లు ఊహకందని రీతిలో.. రాజా సాబ్ రికార్డు బ్రేక్
మన శంకరవరప్రసాద్ గారు అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. తొలి వారం వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఓ ప్రాంతీయ సినిమాకు ఇప్పటి వరకూ సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.292 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) సంక్రాంతి సెలవులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ రూ. 300 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది.

7వ రోజు కూడా తగ్గని జోరు..
బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. మన శంకరవరప్రసాద్ గారు సినిమా వారం మొత్తం నిలకడగా రాణించింది. 7వ రోజు (ఆదివారం) ఇండియాలో రూ. 17.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 157.75 కోట్లకు (గ్రాస్ రూ. 189 కోట్లు) చేరాయి. ఓవర్సీస్‌లోనూ సుమారు 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 225 కోట్లు దాటగా.. చిత్ర నిర్మాతలు మాత్రం ఇప్పటికే రూ. 292 కోట్లు వసూలయ్యాయని పోస్టర్స్ ద్వారా చెబుతుండటం విశేషం. ఒక రీజినల్ సినిమాకు ఫస్ట్ వీక్‌లో ఇవి రికార్డు స్థాయి వసూళ్లు.
“ప్రతి థియేటర్, ప్రతి కేంద్రం.. ప్రతి ప్రాంతం, ప్రతి గుండె.. ది స్వాగ్ కా బాప్ అన్నింటినీ జయించాడు.. మన శంకరవరప్రసాద్ గారికి మొదటి వారంలోనే రూ.292 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్.. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్‌బస్టర్ 2వ వారంలోకి ప్రవేశించింది” అనే క్యాప్షన్ తో షైన్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది.
‘రాజా సాబ్’ను దాటేసిన మెగాస్టార్
ఈ సంక్రాంతికి వచ్చిన మరో భారీ బడ్జెట మూవీ, ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ వసూళ్లను చిరు సినిమా అధిగమించింది. ‘రాజా సాబ్’ నెగెటివ్ టాక్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్ల వద్ద నెమ్మదించింది. కానీ చిరంజీవి సినిమా మూడు రోజులు ఆలస్యంగా విడుదలైనప్పటికీ (జనవరి 12న), తక్కువ ఓపెనింగ్స్‌తో మొదలై.. ఇప్పుడు ప్రభాస్ సినిమాను క్రాస్ చేసింది. గత వీకెండ్‌లో చిరు సినిమా ఇండియాలో రూ. 55 కోట్లు రాబట్టగా, ప్రభాస్ సినిమా కేవలం రూ. 9 కోట్లకు పరిమితమైంది.
సినిమా విశేషాలు నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


