మన శంకర వర ప్రసాద్ గారుకు షాక్ తప్పదా? ఆ రూ.42 కోట్ల కలెక్షన్లు తిరిగి ఇచ్చేయాల్సిందేనా? కోర్టులో కేసు

బాక్సాఫీస్ మోత మోగిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారుకు బిగ్ షాక్. ఆ మూవీ కలెక్షన్లలో రూ.42 కోట్లు రికవరీ చేయాలంటూ ఓ వ్యక్తి తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 

Published on: Jan 24, 2026, 13:57:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి 2026 విన్నర్ మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు భారీ షాక్. ఈ మూవీ కలెక్షన్లపై కోర్టులో కేసు విచారణకు వచ్చింది. పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన వసూళ్లను రికవరీ చేయాలంటూ ఓ వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని హై కోర్టు విచారణకు స్వీకరించింది.

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి (x/GoldBoxEnt)
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి (x/GoldBoxEnt)

మన శంకర వర ప్రసాద్ గారుపై కేసు

సంక్రాంతి 2026 సందర్భంగా జవనరి 12న థియేటర్లలో రిలీజైంది మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీ ప్రీమియర్స్, టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్రీమియర్, టికెట రేట్ల పెంపుపై హై కోర్టుల ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై న్యాయవాది పాదూరి శ్రీనివాస రెడ్డి కోర్టులో కేసు వేశారు.

రూ.42 కోట్లు

చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు లాయర్ పాదూరి శ్రీనివాస రెడ్డి. దీనిపై హై కోర్టు విచారణ జరిపింది. రూ.42 కోట్లపై వివరాలు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీఎస్టీ అధికారులను కోర్టు ఆదేశించింది. నోటీసులు జారి చేస్తే, విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది కోర్టు.

సమస్య ఏంటంటే?

నిజానికి గతంలో ప్రభుత్వం అనుమతితో సినిమా రిలీజ్ ల టైమ్ లో ప్రీమియర్, టికెట్ రేట్లను పెంచుకున్నాయి. అయితే దీనిపై హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టికెట్ల పెంపుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు ప్రీమియర్ కు రూ.600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 పెంచుకునేలా జనవరి 8న హోంశాఖ ప్రభుత్వ కార్యదర్శి మెమో జారీ చేశారు.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మెమో జారీ చేశారని, ఇధి కోర్టు ఉల్లంఘన అని న్యాయవాది శ్రీనవాస రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పెంచిన టికెట్ రేట్లతో వసూలు చేసిన రూ.42 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. వీటిని రికవరీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

సంక్రాంతి సందర్భంగా రిలీజైన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇండియాలో రూ.170 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. మరి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుపై, దీంతో వచ్చిన కలెక్షన్లపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్టర్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More