మెగా బ్లాక్ బస్టర్.. మన శంకర వర ప్రసాద్ గారు 10 రోజుల కలెక్షన్లు ఇవే.. చిరు మేనియా

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతి 2026 విన్నర్ గా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 10 రోజుల వసూళ్లపై ఓ లుక్కేయండి. 

Published on: Jan 22, 2026, 05:36:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిరు మేనియాతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. మెగాస్టార్ క్రేజ్ తో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. చిరంజీవి సంక్రాంతి 2026 సినిమా మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూసేద్దాం.

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

బాక్సాఫీస్ దగ్గర మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రన్ కొనసాగుతోంది. సంక్రాంతి సెలవులు ముగియడం, వీక్ డేస్ కావడంతో కాస్త జోరు తగ్గినా ఈ మూవీ నిలకడ ప్రదర్శిస్తోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పదో రోజు (జనవరి 21) ఇండియాలో రూ.4 కోట్ల నెట్ వసూళ్లు దక్కించుకుంది. బుధవారం రూ.4 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.

10 రోజుల రిపోర్టు

రికార్డులు బద్దలు కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఇండియాలో మంచిగా ఆడుతోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ మూవీ 10 రోజుల్లో ఇండియాలో రూ.175.65 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో ఇదే హైయ్యస్ట్.

అదే జోరు

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ల నుండి రూ.9.35 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం మొదటి రోజు రూ.32.25 కోట్లు, రెండవ రోజు రూ.18.75 కోట్లు, మూడో రోజు రూ.19.5 కోట్లు, నాలుగో రోజు రూ.22 కోట్లు, అయిదో రోజు రూ.19.5 కోట్లు సంపాదించింది. 6వ రోజు రూ.18.9 కోట్లు, 7వ రోజు రూ.17.65 కోట్లు, 8 వ రోజు రూ.8 కోట్లు, 9వ రోజు రూ.5.75 కోట్లు ఖాతాలో వేసుకుంది.

హైయ్యస్ట్ కలెక్షన్లు

చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా మన శంకర వర ప్రసాద్ గారు రికార్డు నెలకొల్పింది. చిరంజీవి గత చిత్రాల జీవిత కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. భోళా శంకర్ భారతదేశంలో రూ.30.63 కోట్లు, ఆచార్య రూ.56.14 కోట్లు, గాడ్ ఫాదర్ రూ.74.03 కోట్లు, వాల్తేర్ వీరయ్య రూ.161.06 కోట్లు కొల్లగొట్టాయి. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 12న రిలీజైంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More