డే బై డే-రికార్డు బై రికార్డు-మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల సునామీ-చిరంజీవి కెరీర్లోనే అత్యధికం-లాభాల్లోకి సినిమా

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీలా కొనసాగుతోంది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు అందుకుంది. 

Published on: Jan 18, 2026, 14:30:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన శంకర వర ప్రసాద్ గారుతో చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల దుమ్మురేపుతోంది. లాభాల్లోకి ఎంటరైంది.

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాక్సాఫీస్ మోత మోగిస్తోంది. ఈ చిత్రం ఒక వారంలోనే చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. అన్ని రంగాలలో బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీ లాభాల జోన్ లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో రూ.261 కోట్ల కలెక్షన్లు సాధించింది.

రికార్డు బై రికార్డు

మన శంకర వర ప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకు పైగా వసూలు చేసిందని షైన్ స్క్రీన్స్ ఆదివారం (జనవరి 18) ప్రకటించింది. ఈ చిత్రం నుంచి చిరంజీవి, నయనతార స్టిల్ ను పోస్ట్ చేస్తూ ఎక్స్ లో ఇలా రాసుకొచ్చింది.

"డే బై డే (రోజు రోజుకు).. రికార్డు బై రికార్డు (రికార్డు తర్వాత రికార్డు). బాక్సాఫీస్ దగ్గర మన శంకర వర ప్రసాద్ గారు హిస్టరీ క్రియేట్ చేస్తోంది. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు కేవలం 6 రోజుల్లోనే రూ.261 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించింది. రూ.300 కోట్ల మైలురాయి దిశగా సాగుతోంది’’ అని షైన్ స్క్రీన్స్ పోస్టు చేసింది.

అత్యధిక కలెక్షన్లు

చిరంజీవి కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా మన శంకర వర ప్రసాద్ గారు నిలిచింది. ఈ మూవీ సైరా నరసింహా రెడ్డి రికార్డును బ్రేక్ చేసింది. 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.246.6 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ గారు రూ.261 కోట్లతో దీన్ని దాటేసింది.

ఇక చిరంజీవి సినిమాల్లో వాల్తేర్ వీరయ్య ప్రపంచవ్యాప్తంగా రూ.219 కోట్లు వసూలు చేసింది. దీని తరువాత అతని 2017లో రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 ఏమో రూ.164 కోట్ల కలెక్షన్లతో, 2022 చిత్రం గాడ్ ఫాదర్ రూ.107 కోట్ల కలెక్షన్లతో ఉన్నాయి.

Chiranjeevi's top 5 grossersCollection
Mana Shankara Vara Prasad Garu 261 crore & counting
Sye Raa Narasimha Reddy 246.6 crore
Waltair Veerayya 219 crore
Khaidi No 150 164 crore
Godfather 107 crore

లాభాల్లోకి

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని, ఇప్పుడు లాభాల జోన్ లో ఉందని ప్రొడక్షన్ హౌస్ ఆదివారం ప్రకటించింది. ఈ ప్రకటన చేస్తూ వారు.. "ప్రపంచం మొత్తం మెగాస్టార్ ను జరుపుకుంటోంది. మన శంకర వర ప్రసాద్ గారు బ్రేక్ ఈవెన్ కేవలం 6 రోజుల్లోనే పూర్తయింది. అన్ని ప్రాంతాలు ప్రాఫిట్ జోన్ లోనికి బ్లాక్ బస్టర్ ప్రయాణం రాక్-సాలిడ్ బాక్సాఫీస్ రన్ తో కొనసాగుతుంది’’ అని పోస్టు చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More