ఇన్‌ఫ్రంట్ కలెక్షన్ ఫెస్టివల్.. అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్.. మన శంకరవరప్రసాద్ గారు రూ.200 కోట్లు నాటౌట్

మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఈ సందర్భంగా ఇన్‌ఫ్రంట్ కలెక్షన్ ఫెస్టివల్ అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Jan 16, 2026, 21:15:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సోమవారం (జనవరి 12) విడుదలైన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రభాస్ ‘రాజా సాబ్’తో పోటీ పడి మరీ చిరు ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషం.

ఇన్‌ఫ్రంట్ కలెక్షన్ ఫెస్టివల్.. అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్.. మన శంకరవరప్రసాద్ గారు రూ.200 కోట్లు నాటౌట్
ఇన్‌ఫ్రంట్ కలెక్షన్ ఫెస్టివల్.. అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్.. మన శంకరవరప్రసాద్ గారు రూ.200 కోట్లు నాటౌట్

బాస్ బ్యాటింగ్ మొదలైంది: అనిల్ రావిపూడి

చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి ఈసారి ఈ మూవీతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై అనిల్ ఎమోషనల్ అయ్యాడు.

శుక్రవారం (జనవరి 16) సాయంత్రం తన ‘ఎక్స్’ ఖాతాలో చిరంజీవి పక్కన నిల్చున్న ఫోటోను షేర్ చేశాడు. వెనుక ‘200 కోట్లు’ అని రాసి ఉన్న పోస్టర్‌తో.. "ఇది కేవలం ఫస్ట్ పవర్-ప్లే మాత్రమే.. బాస్ బ్యాటింగ్ మొదలైంది. ఇన్ ఫ్రంట్ కలెక్షన్ల పండగ ఉంది. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు" అంటూ రాసుకొచ్చాడు.

చిరు ఇంట్లో గ్రాండ్ పార్టీ..

సినిమా విజయాన్ని పురస్కరించుకొని గురువారం (జనవరి 15) రాత్రి చిరంజీవి తన జూబ్లీహిల్స్ నివాసంలో చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విక్టరీ వెంకటేష్ కూడా హాజరయ్యాడు. "నా హీరోలతో, మొత్తం టీమ్‌తో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి. చరణ్ రావడం చాలా ఆనందంగా ఉంది" అని అనిల్ పేర్కొన్నాడు.

టికెట్ల కోసం ఎగబడుతున్న జనం..

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనం థియేటర్లకు పోటెత్తుతున్నారు. డిమాండ్ దృష్ట్యా అదనపు షోలు, స్క్రీన్లు పెంచుతున్నట్లు నిర్మాత షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది.

గతేడాది కూడా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఆ మూవీ రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇలా సీనియర్ హీరోలతో మూవీస్ తీస్తూ వాళ్ల కెరీర్ బెస్ట్ అందిస్తున్న అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ క్రేజ్ సంపాదిస్తున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More