రెండు రోజుల్లోనే ఆ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసిన మన శంకరవరప్రసాద్ గారు.. బాక్సాఫీస్ దగ్గర చిరు దూకుడు

చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర దూకుడుగా వెళ్తోంది. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా కూడా రెండు రోజుల్లోనే చిరు డిజాస్టర్ మూవీ ఆచార్య లైఫ్ టైమ్ కలెక్షన్లను మించిపోవడం విశేషం.

Published on: Jan 14, 2026, 10:39:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘భోళా శంకర్’ పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) సినిమాలో చిరు తన మార్క్ కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.

రెండు రోజుల్లోనే ఆ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసిన మన శంకరవరప్రసాద్ గారు.. బాక్సాఫీస్ దగ్గర చిరు దూకుడు
రెండు రోజుల్లోనే ఆ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసిన మన శంకరవరప్రసాద్ గారు.. బాక్సాఫీస్ దగ్గర చిరు దూకుడు

రెండు రోజుల్లోనే రూ. 60 కోట్లు దాటేశాడు

ప్రముఖ ట్రేడ్ ట్రాకింగ్ సైట్ ‘సాక్నిల్క్’ (Sacnilk) నివేదిక ప్రకారం.. ఈ మన శంకరవరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ నంబర్స్ ఇలా ఉన్నాయి. మొదటి రోజు మొత్తంగా రూ. 32.25 కోట్లు, స్పెషల్ ప్రీవ్యూల ద్వారా రూ. 9.35 కోట్లు కలిపి వసూళ్లు రూ. 41.6 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండో రోజు 19.50 కోట్లు వచ్చాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్ దాటేసి, ఇండియాలో రూ. 61.10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

‘రాజా సాబ్’ డల్.. మెగాస్టార్ ఫుల్ జోష్

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా భారీ ఓపెనింగ్స్ (రూ. 62.5 కోట్లు) సాధించినప్పటికీ, రెండో రోజు నుంచి వసూళ్లలో భారీ తగ్గుదల కనిపించింది. కానీ చిరంజీవి సినిమా మాత్రం నిలకడగా రాణిస్తోంది. ‘రాజా సాబ్’ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి రూ. 119.45 కోట్లు రాబట్టగా, చిరు సినిమా ఆ మార్కును అందుకోవడానికి వేగంగా దూసుకెళ్తోంది.

‘ఆచార్య’తో సహా బాలీవుడ్ సినిమాల రికార్డ్స్ బ్రేక్

కేవలం రెండు రోజుల్లోనే ఈ మన శంకర వరప్రసాద్ గారు సాధించిన వసూళ్లు.. చిరంజీవి గత సినిమా ‘ఆచార్య’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ (రూ. 56 కోట్లు) కంటే ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన అగస్త్య నందా ‘ఇక్కిస్’ (రూ. 30 కోట్లు), కార్తీక్ ఆర్యన్ రొమాంటిక్ డ్రామా (రూ. 49.5 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను కూడా ఈ సినిమా అధిగమించింది.

కామెడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కథ పరంగా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. చిరంజీవి కామెడీ టైమింగ్, అతని ఎనర్జీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ చేసిన గెస్ట్ రోల్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచింది. నయనతార, క్యాథరిన్ థ్రెసా కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More