రెండో రోజు సగానికి పడిపోయిన రాజా సాబ్ వసూళ్లు.. ఇండియాలో రూ.100 కోట్లకు చేరువలో ప్రభాస్ హారర్ కామెడీ
ప్రభాస్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ రెండో రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి. అయితే ఇండియాలో మాత్రం ఈ మూవీ రూ.100 కోట్ల వైపు వెళ్తోంది. తొలి రోజే మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు రావడం వసూళ్లపై ప్రభావం చూపుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ జర్నీ పడుతూ లేస్తూ సాగుతోంది. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్‌లోని భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల సరసన నిలవలేకపోయింది. అయినప్పటికీ ఇండియాలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్ల మైలురాయికి చేరువలో ఉంది.

రెండో రోజు కలెక్షన్స్.. భారీ డ్రాప్
ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకర్ ‘సాక్నిల్క్’ (Sacnilk) రిపోర్టు ప్రకారం.. రెండో రోజు (శనివారం) ‘రాజా సాబ్’ ఇండియాలో రూ. 27.83 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తొలి రోజుతో పోలిస్తే ఇది దాదాపు 48.22% తక్కువ. అంటే కలెక్షన్స్ సగానికి పడిపోయాయి.
తెలుగు: రూ. 22.38 కోట్లు
హిందీ: రూ. 5.2 కోట్లు
తమిళం: రూ. 0.15 కోట్లు
జనవరి 9న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ నడుమ తొలి రోజు రూ. 53.75 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. రెండు రోజులు కలిపి ఇండియాలో ఈ సినిమా రూ. 81.58 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, గ్రాస్ వసూళ్లు రూ. 108.4 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన రూ. 30 కోట్లు కలుపుకుంటే.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రాజా సాబ్’ రూ. 138.4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోనే హవా.. నార్త్‌లో డల్
రెండో రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ 44 శాతంగా నమోదైంది. ఉదయం షోలకు 29 శాతం ఉన్న ఆదరణ, రాత్రి షోల సమయానికి 51 శాతానికి పెరిగింది. హైదరాబాద్‌లో ఏకంగా 1,159 షోలు ప్రదర్శితమవ్వగా, బెంగళూరులో 653 షోలు పడ్డాయి. విజయవాడ, వైజాగ్, గుంటూరులోనూ ఆదరణ బాగుంది.
అయితే హిందీ వెర్షన్ మాత్రం డీలా పడింది. రెండో రోజు కేవలం 12.95% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలలో ఎక్కువ షోలు ఉన్నప్పటికీ జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. తమిళంలోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది (21% ఆక్యుపెన్సీ). చెన్నైలో మాత్రం పర్వాలేదనిపించింది.
కొత్త వెర్షన్ వస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
సినిమాలోని వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యత, రన్-టైమ్ విషయంలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించిన కొన్ని హైలైట్ సీన్లు సినిమాలో లేకపోవడం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనిపై స్పందించిన చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "అభిమానుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, నిన్న సాయంత్రం కూర్చొని సెకండ్ హాఫ్‌ను మరింత షార్ప్‌గా ఎడిట్ చేశాం. అలాగే మిస్ అయిన సీన్లను శనివారం సాయంత్రం 6 గంటల షో నుంచి కలుపుతున్నాం. సుమారు 8-9 నిమిషాల నిడివి గల ఈ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పైకప్పు మీద జరిగే ఫైట్ సీన్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాలేదు. దీనికోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు" అని వివరించాడు. ఈ కొత్త సీన్లతో సినిమా ఆదరణ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


