బాక్సాఫీస్ రారాజు ప్రభాస్-ఇండియన్ సినీ హీరోల్లో ఒకే ఒక్కడు-రాజా సాబ్ సెంచరీతో అదిరే రికార్డు
రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తనకు తిరుగులేదని చాటాడు. రాజా సాబ్ సెంచరీతో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ హీరోల్లో ఒకే ఒక్క హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటో ఇక్కడ చూసేయండి.
పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ ను ఏలుతున్న ప్రభాస్ మరోసారి తన సత్తాచాటాడు. మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దూసుకెళ్తున్న ది రాజా సాబ్ తో మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలిచాడు. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డేనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఓపెనింగ్ పరంగా ప్రభాస్ ఓ అద్భుతమైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

రాజా సాబ్ కలెక్షన్లు
ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ థియేటర్లో దుమ్ము రేపుతోంది. మిక్స్ డ్ టాక్ తోనూ కలెక్షన్లు కుమ్మేస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన ఈ మూవీకి భారీ ఓపెనింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజు రూ.112 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ప్రభాస్ రికార్డు
రాజా సాబ్ కలెక్షన్ల సెంచరీ కొట్టడంతో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోకు ఇప్పటివరకూ సాధ్యం కాని చరిత్ర అందుకున్నాడు ప్రభాస్. అదే రూ.100 కోట్ల ఓపెనింగ్ సినిమాలు. ప్రభాస్ కెరీర్ లో రూ.100 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాలు ఆరు. మరే హీరో ఖాతాలో ఇన్ని సినిమాలు లేవు.
రూ.100 కోట్ల ఓపెనింగ్
బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాక్సాఫీస్ మొనగాడిగా ఎదిగాడు. ఇప్పుడు ఫస్ట్ డేనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఆరు సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. రాజా సాబ్ రీసెంట్ గా రూ.112 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది.
ఫస్ట్ డేనే రూ.100 కోట్లు సాధించిన ప్రభాస్ సినిమాల్లో బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజా సాబ్ ఉన్నాయి.
సెంచరీ వసూళ్లు
బాహుబలి మూవీ విజయం, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఉత్కంఠతో బాహుబలి 2కి భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
- బాహుబలి 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.212 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.
- సాహో ఏమో రూ.130 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది.
- ఇక ప్రభాస్ కెరీర్ లోనే డిజాస్టర్లలో ఒకటిగా ఆది పురుష్ మూవీ నిలిచింది. కానీ వసూళ్లలో మాత్రం అదరగొట్టింది. తొలి రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.140 కోట్లు కొల్లగొట్టింది.
- సలార్ మూవీకి రూ.178 కోట్లు వచ్చాయి. కల్కి చిత్రానికి తొలి రోజు రూ.191 కోట్లు దక్కాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


