ప్రభాస్ గ్యారేజీలో కోట్లు విలువచేసే లగ్జరీ కార్లు- ఇది మన రాజా సాబ్ రేంజ్..
సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు, నిజ జీవితంలోనూ 'రాజా సాబ్' ప్రభాస్ అభిరుచులు చాలా రిచ్‌గా ఉంటాయి! ముఖ్యంగా ఆయన గ్యారేజీలో ఉన్న లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి అల్ట్రా లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..
వెండితెరపై 'బాహుబలి'గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్, వ్యక్తిగత జీవితంలో చాలా నిరాడంబరంగా ఉంటారు. సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రదర్శించడానికి పెద్దగా ఇష్టపడని ఈ 'రాజా సాబ్' నటుడికి ఒక బలమైన ప్యాషన్ ఉంది. అదే కార్లు! ప్రభాస్ గ్యారేజీని ఒకసారి గమనిస్తే.. కారు ప్రేమికులకు అదొక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. వేగంతో దూసుకెళ్లే సూపర్ కార్ల నుంచి రాజసాన్ని ఒలికించే లగ్జరీ కార్ల వరకు ప్రభాస్ వద్ద ఉన్న ఆ అద్భుతమైన కలెక్షన్ గురించి ఇక్కడ ఓ లుక్కేయండి..

రాజా సాబ్ ప్రభాస్ కార్ కలెక్షన్..
- రోల్స్ రాయిస్ ఫాంటమ్-
రాజసానికి పెట్టింది పేరు ప్రభాస్. అలాంటి వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడంటే, ఆ కారులోనూ రాజసం ఉండాలి కదా! అందుకే.. లగ్జరీ, రాజసం కోసం ప్రభాస్ దగ్గర ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల ఫేవరెట్ కార్లలో ఇదొకటి. ఈ లిమొజైన్ కారులో 6.75 లీటర్ల వీ12 ఇంజిన్ ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకంగా తయారయ్యే ఈ కారు బేస్ ప్రైసే ఇండియాలో రూ. 9 కోట్లు! ఒకవేళ ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ వేరియంట్ అయితే ధర రూ. 10.48 కోట్లకు పైమాటే.
ఇవి ఎక్స్‌షోరూం ధరలు.
2. లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్-
ప్రభాస్ కార్ల కలెక్షన్‌లో అత్యంత హాట్ కార్ ఏదైనా ఉందంటే అది లంబోర్ఘిని అవెంటడోర్ అని చెప్పుకోవాలి. ఇది మామూలు మోడల్ కాదు, గాలితో పోటీ పడుతూ దూసుకెళ్లే 'ఎస్ రోడ్‌స్టర్' వేరియంట్. మొదట ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉన్న ఈ కారును, ప్రభాస్ ఇప్పుడు సాటిన్ బ్లాక్ షేడ్‌లోకి మార్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సూపర్ కారులో 6.5 లీటర్ల వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 770 పీఎస్ శక్తిని, 720 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ అమ్మకాల్లో లేదు. దీని స్థానంలో లంబోర్గిణి 'రివ్యూల్టో' వచ్చింది.
కానీ ఇది మార్కెట్లో ఉన్నప్పుడు దీని ధర సుమారు రూ. 6 కోట్లు (ఎక్స్-షోరూమ్).
3. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ-
భారతీయ సెలబ్రిటీల గ్యారేజీలో రేంజ్ రోవర్ లేకపోతే అది అసంపూర్ణమే1 ప్రభాస్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గతంలో పాత తరం రేంజ్ రోవర్ వాడిన ఆయన, 2023లో లేటెస్ట్ జెనరేషన్ మోడల్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. నలుపు రంగులో నిగనిగలాడే ఈ భారీ ఎస్‌యూవీలో 4.4 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
రేంజ్ రోవర్ లైనప్‌లోనే అత్యంత ఖరీదైన ‘ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ’ మోడల్ ఇది. దీని ప్రస్తుత ధర సుమారు రూ. 4.25 కోట్లు (ఎక్స్-షోరూమ్).
తెరపైనే కాదు, రోడ్డుపై వెళున్నప్పుడు కూడా ప్రభాస్ తన కార్ల ఎంపికతో తన స్టార్‌డమ్‌ను చాటుకుంటారు. తనకున్న క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ మెగా గ్యారేజీని ఆయన మెయింటెన్ చేస్తున్నారు.
రాజా సాబ్ వచ్చేశాడు..
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా శుక్రవారం విడుదలైంది. హారర్-కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో రూ. 45 కోట్లు నెట్ రాబట్టింది.
అయితే సలార్, కల్కి సినిమాలతో పోలిస్తే రాజా సాబ్ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 2024లో వచ్చిన కల్కితో పోల్చితే రాజా సాబ్‌కు ఫస్ట్ డే కలెక్షన్లు సగం మాత్రమే రాగా.. గత ఆరేళ్లలో ప్రభాస్ ఇదే అతి తక్కువ అని తెలుస్తోంది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


