ది రాజా సాబ్‌కు తొలి రోజు దారుణమైన కలెక్షన్లు.. కల్కిలో సగం.. ప్రభాస్‌కు గత ఆరేళ్లలో ఇదే అతి తక్కువ

ప్రభాస్‌కు ది రాజా సాబ్ గట్టి షాకే ఇచ్చేలా ఉంది. సినిమా మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో తొలి రోజు ఇండియాలో కేవలం రూ.45 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల గ్రాస్ వసూలైంది.

Published on: Jan 10, 2026, 07:27:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దారుణమైన వసూళ్లు సాధించింది. సలార్, కల్కి సినిమాలతో పోలిస్తే వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కల్కిలో సగం మాత్రమే రాగా.. గత ఆరేళ్లలో ప్రభాస్ ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. హారర్-కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో రూ. 45 కోట్లు నెట్ రాబట్టింది. అయితే ఐదు వారాలుగా బాక్సాఫీస్ ను ఏలుతున్న రణవీర్ సింగ్ సినిమా రికార్డును రాజా సాబ్ బ్రేక్ చేయడం విశేషం.

ది రాజా సాబ్‌కు తొలి రోజు దారుణమైన కలెక్షన్లు.. కల్కిలో సగం.. ప్రభాస్‌కు గత ఆరేళ్లలో ఇదే అతి తక్కువ
ది రాజా సాబ్‌కు తొలి రోజు దారుణమైన కలెక్షన్లు.. కల్కిలో సగం.. ప్రభాస్‌కు గత ఆరేళ్లలో ఇదే అతి తక్కువ

ది రాజా సాబ్ బాక్సాఫీస్ రిపోర్ట్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కలెక్షన్ల విషయంలో ప్రభాస్ గత చిత్రాలైన ‘సలార్’, ‘కల్కి 2898 AD’ స్థాయిని అందుకోవడంలో ఈ సినిమా వెనుకబడిందనే చెప్పాలి. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ ‘సాక్నిల్క్’ (Sacnilk) వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాడు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 45 కోట్ల నెట్ వసూలు చేసింది.

కొవిడ్ మహమ్మారి తర్వాత తక్కువ ఓపెనింగ్స్

కరోనా సంక్షోభం తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాల్లో అత్యల్ప ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘ది రాజా సాబ్’ నిలిచింది. అయితే విశ్లేషకులు దీన్ని ముందే ఊహించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కావడం ఒక కారణమైతే, ఇది ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్ సినిమా కాకపోవడం మరొక ప్రధాన కారణం. సాధారణంగా యాక్షన్ సినిమాలకు ఉండే ఓపెనింగ్స్ హారర్ కామెడీలకు ఉండవు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సినిమా ఇండియాలో రూ. 45 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, రాజా సాబ్ ఒక విషయంలో సత్తా చాటాడు. గత ఐదు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో కొనసాగుతున్న రణవీర్ సింగ్ మూవీ ‘ధురంధర్’ ఆధిపత్యానికి రాజా సాబ్ గండికొట్టాడు. విడుదలైన రోజు ఉదయం 9 గంటలకే ‘ధురంధర్’ గురువారం నాటి కలెక్షన్లను (రూ. 4.25 కోట్లు) రాజా సాబ్ అలవోకగా దాటేశాడు.

ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే..

ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే రాజా సాబ్ ఘనత చాలా చిన్నదిగానే కనిపిస్తోంది.

కల్కి 2898 AD: రూ. 95 కోట్లు

సలార్: రూ. 90 కోట్లు

ఆదిపురుష్: రూ. 86 కోట్లు

ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ సాధించినా తర్వాత నిరాశపరిచింది. ఆ కోణంలో చూస్తే ప్రభాస్ అభిమానులకు ఈ నంబర్స్ కాస్త నిరాశ కలిగించవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం షారుక్ ఖాన్ ‘జవాన్’ (రూ. 64 కోట్లు), రణబీర్ కపూర్ ‘యానిమల్’ (రూ. 63 కోట్లు), విజయ్ ‘లియో’ (రూ. 64.80 కోట్లు) వంటి సినిమాల రికార్డులను అందుకోవడం రాజా సాబ్ కు కష్టమే అనిపిస్తోంది. అంతేకాదు తొలి రోజే మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో రానున్న రోజుల్లో వసూళ్లపై మరింత ప్రభావం పడనుంది.

‘వింటేజ్ ప్రభాస్’ ఈజ్ బ్యాక్

దర్శకుడు మారుతి తెరకెక్కించిన ది రాజా సాబ్ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడానికి ప్రధాన కారణం ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసినవన్నీ భారీ యాక్షన్ సినిమాలే. దశాబ్దం తర్వాత అతడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్‌లోకి అడుగుపెట్టడం విశేషం. తెరపై ప్రభాస్‌ను చూస్తుంటే ‘వింటేజ్ ప్రభాస్’ మళ్లీ వచ్చాడని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More