థియేటర్లలోకి నకిలీ మొసళ్లను తీసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

ది రాజా సాబ్ రన్ అవుతున్న థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. కొందరు ఏకంగా నకిలీ మొసళ్లను థియేటర్లలోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 9, 2026, 14:04:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు. శుక్రవారం (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది రాజా సాబ్' థియేటర్ల వద్ద అభిమానులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చూడటానికి వస్తూ ఫ్యాన్స్ తమ వెంట 'మొసళ్లను' తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అవి బొమ్మ మొసళ్లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

థియేటర్లలోకి నకిలీ మొసళ్లను తీసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
థియేటర్లలోకి నకిలీ మొసళ్లను తీసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

థియేటర్లో మొసళ్ల గోల.. ఎందుకంటే?

మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమా ది రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ చేసిన ఈ వినూత్న స్టంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. అభిమానులు పెద్ద పెద్ద మొసలి బొమ్మలను భుజాన వేసుకుని, నినాదాలు చేస్తూ థియేటర్లలోకి పరిగెత్తడం కనిపిస్తోంది.

'ది రాజా సాబ్' ట్రైలర్‌లో ప్రభాస్ ఒక మొసలిని పట్టుకుని విసిరేసే ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్‌ చూసి ఇన్‌స్పైర్ అయిన ఫ్యాన్స్ ఇలా థియేటర్లకు డమ్మీ మొసళ్లతో వచ్చి హల్చల్ చేశారు. ఇది చూసిన మిగతా ఆడియెన్స్ మొదట షాక్ అయినా తర్వాత ఎంజాయ్ చేశారు.

ది రాజా సాబ్‌కు నెగటివ్ రివ్యూలు

భారీ అంచనాల మధ్య రిలీజైన ది రాజా సాబ్ సినిమాకు నెగటివ్ రివ్యూలు వస్తుండటం అభిమానులకు మింగుడు పడటం లేదు. ప్రభాస్ రేంజ్ సినిమా కాదని.. డైరెక్టర్ మారుతి దారుణంగా ఫెయిలయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి. పైగా రన్ టైమ్ మూడు గంటలకుపైగా ఉండటం కూడా సినిమాకు మైనస్ గా మారింది.

ఇక బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. శుక్రవారం (జనవరి 9) ఉదయం నుంచే కలెక్షన్ల వర్షం మొదలైంది. ఈ రిపోర్ట్ రాసే సమయానికి ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 8.26 కోట్లు వసూలు చేసింది. ఈవెనింగ్ షోలకు ఈ నెంబర్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ది రాజా సాబ్ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ది రాజా సాబ్ కథేంటంటే?

జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడే తన అమ్మమ్మతో కలిసి ఉండే 'రాజా' (ప్రభాస్) కథ ఇది. తప్పిపోయిన తన తాతయ్యను వెతకాలని అమ్మమ్మ కోరడంతో.. రాజా ఒక పాత భవంతిలోకి అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎదురైన అతీంద్రియ శక్తులు, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ట్విస్టులే ఈ సినిమా కథ. ఇందులో ప్రభాస్ తోపాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More