2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 తెలుగు సినిమాలివే.. నంబర్ వన్ ప్లేస్ లో పవన్ మూవీ.. ఓ ఫ్లాప్ కూడా
2025లో తెలుగు సినిమా జోరు కొనసాగించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అంతకుముందులా మెరుపులు మెరిపించలేకపోయింది. మరి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఏవో ఇక్కడ చూసేయండి.
2025లో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటి కూడా రూ.400 కోట్లు దాటలేకపోయింది. ఈ ఏడాది టాలీవుడ్ కు పెద్దగా కలిసిరాలేదు. మరి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏవి అంటే? ఇక్కడ లిస్ట్ ఉంది ఓ లుక్కేయండి.

ఓజీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిగ్ స్క్రీన్ పై తన పవర్ చూపించాడు. 2025లో కాదు పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఓజీ రికార్డు నమోదు చేసింది. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఓజీ ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది.
సంక్రాంతికి వస్తున్నాం
తెలుగులో 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రం కేవలం తెలుగులోనే రిలీజైంది. అయినా అనిల్ రావిపూడి డైరెక్షన్ తో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా రూ.303 కోట్లు కొల్లగొట్టింది.
గేమ్ ఛేంజర్
రామ్ చరణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. 2025లో రిలీజైన మూవీ దారుణంగా నిరాశపర్చింది. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చివరకు రూ.195 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ పరంగా చూస్తే ఇది డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా.
మిరాయ్
యువ హీరో తేజ సజ్జా కెరీర్ లో మరో మైల్ స్టోన్ లాంటి సినిమా మిరాయ్. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. సెప్టెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. హనుమాన్ తర్వాత మిరాజ్ తో తేజ సజ్జా మరో విజయం అందుకున్నాడు.
కుబేర
2025లో బాగా బజ్ క్రియేట్ చేసిన మూవీ కుబేర. ఫీల్ గుడ్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇందులో నాగార్జున, శేఖర్ కమ్ముల లీడ్స్ రోల్ ప్లే చేశారు. రష్మిక మందన్న హీరోయిన్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.137 కోట్లు ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది కుబేర. ఇందులో నాగార్జున, ధనుష్ యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


