బాక్సాఫీస్ బాస్.. అంతటా చిరు క్రేజ్.. మన శంకర వర ప్రసాద్ గారు 9వ రోజు కలెక్షన్లు

మన శంకర వర ప్రసాద్ గారుతో బాక్సాఫీస్ బాస్ గా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సత్తాచాటుతున్నారు. అంతటా చిరు క్రేజ్ కనిపిస్తోంది. సంక్రాంతి సెలవులు అయిపోయినా, వీక్ డేస్ లోనూ ఈ మూవీ మంచి కలెక్షన్లే సాధిస్తోంది. 9 రోజుల్లో ఎన్ని రూ.కోట్లు రాబట్టిందో ఇక్కడ చూసేయండి. 

Published on: Jan 21, 2026, 05:32:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి సెలవులు అయిపోయినా, వీక్ డేస్ లోనూ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి క్రేజ్ కొనసాగుతోంది. కలెక్షన్లు కాస్త తగ్గినా మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఇండియాలో 9 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టిందో ఇక్కడ చూసేద్దాం.

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి

మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొమ్మిదో రోజు (జనవరి 20) ఇండియాలో రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్లు.

మన శంకర వర ప్రసాద్ గారు మొత్తం వసూళ్లు

సక్నిల్క్ ప్రకారం మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇప్పటివరకూ, 9 రోజుల్లో కలిపి ఇండియాలో రూ.171 కోట్లకు పైగా వసూలు చేసింది. మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ల నుండి రూ.9.35 కోట్లు సంపాదించింది. ఈ చిత్రం మొదటి రోజు రూ.32.25 కోట్లు, రెండవ రోజు రూ.18.75 కోట్లు, మూడవ రోజు రూ.19.5 కోట్లు సంపాదించింది.

4 వ రోజు మన శంకర వర ప్రసాద్ గారు రూ.22 కోట్లు, 5 వ రోజు రూ.19.5 కోట్లు, 6వ రోజు రూ.18.9 కోట్లు, 7 రోజు రూ.17.65 కోట్లు, 8 వ రోజు రూ.8 కోట్లు ఖాతాలో వేసుకుంది. 9వ రోజు రూ 5.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మన శంకర వర ప్రసాద్ గారు ఇండియాలో రూ.171.65 కోట్ల నెట్ కలెక్షన్లతో సత్తాచాటుతోంది.

ఆ సినిమాలను దాటి

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. మెగాస్టార్ గత చిత్రాల జీవితకాల కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది. భోలా శంకర్ భారతదేశంలో రూ.30.63 కోట్లు, ఆచార్య రూ.56.14 కోట్లు, గాడ్ ఫాదర్ రూ.74.03 కోట్లు, వాల్తేర్ వీరయ్య రూ.161.06 కోట్లు కలెక్ట్ చేశాయి.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఇందులో నయనతార, కేథరిన్ తదితరులు నటించారు. ఈ సినిమాతో డైరెక్టర్ గా అనిల్ రావిపూడి వరుసగా 9వ విక్టరీ ఖాతాలో వేసుకున్నారు. మన శంకర వర ప్రసాద్ గారులో విక్టరీ వెంకటేష్ మెరిశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More